యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ జనతా గ్యారేజ్.. సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా పట్ల అంచనాలు భారీగానే ఉన్నాయి. టీజర్, ట్రైలర్ తో కొరటాల శివ జూనియర్ ను ఇదవరకు చూడని కోణాన్ని చూపించి హైప్ క్రియేట్ చేశాడు. ఇక టెంపర్, నాన్నకు ప్రేమతో హిట్ జోష్ లో తారక్ కూడా జనతా గ్యారేజ్ తన ల్యాండ్ మార్క్ మూవీగా అయ్యేందుకు కష్టపడ్డాడు. బృందావనం టైంలో కలిసి పనిచేసిన అనుభవంతో తారకు కు కథ సిద్ధం చేసిన కొరటాల శివ దాన్నే గ్యారేజ్ గా తీర్చిదిద్దాడు.  


ఇక కెరియర్ మొదట్లోనే రికార్డుల చెడుగుడు ఆడిన తారక్ ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని అనుకుంటున్నాడు. కథా బలమున్న సినిమాలు స్టార్ హీరోలు చేస్తే ఆ సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ సాదిస్తాయో ఈ మధ్య సినిమాల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక లాస్ట్ ఇయర్ ఇదే కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన మ్యాజిక్ శ్రీమంతుడు. మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన శ్రీమంతుడు దాదాపు 150 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అంతేకాదు నాన్ బాహుబలి రికార్డులను కైవసం చేసుకుంది.


అయితే ఇప్పుడు జూనియర్ ముందున్న టార్గెట్ శ్రీమంతుడే.. అదే డైరక్టర్ నుండి వస్తున్న సినిమా కాబట్టి అదే రేంజ్ హిట్ అందుకునే ఆలోచనలో ఉన్నాడు తారక్. ఇక లాస్ట్ రెండు సినిమాల హిట్ తో మళ్లీ ఫాంలోకి వచ్చిన యంగ్ టైగర్ జనతా గ్యారేజ్ తో మైండ్ బ్లోయింగ్ హిట్ కొట్టేందుకు రెడీగా ఉన్నాడు. అయితే శ్రీమంతుడు జనతా గ్యారేజ్ ఈ రెండిట్లో కామన్ పాయింట్ సోషల్ మెసేజ్.. అందులో గ్రామాల దత్తత గురించి ప్రస్థావించిన కొరటాల శివ ఇందులో చెట్లను పెంచే ప్రోగ్రాంతో వచ్చాడు. 


సో ఈ రెండు సినిమాలకు దగ్గర పోలికలుండటంతో మహేష్ శ్రీమంతుడు అందుకున్న హిట్ తారక్ జనతా గ్యారేజ్ తో అందుకుంటాడని ఇంకా చెప్పాలంటే శ్రీమంతుడిని మించి ఎక్కువ కలక్షన్స్ సాధిస్తాడని టాక్. ఇక సినిమా హంగామా ఇప్పటికే అన్ని ఏరియాల్లో స్టార్ట్ అయ్యింది. మిడ్ నైట్ షోలకే అందరు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. మరి అనుకున్నట్టే శ్రీమంతుడు మించి హిట్ అవుతుందా లేక గ్యారేజ్ శ్రీమంతుడు లాంటి హిట్ సాధిస్తుందా అన్నది తెలుసుకోవాలంటే మరో రెండు రోజులు ఆగితే సరిపోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: