యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ మొదట్లోనే బాక్సాఫీస్ రికార్డుల చెడుగుడు ఆడిన యంగ్ టైగర్ ఈ మధ్య రేసులో కాస్త వెనుకపడ్డట్టు కనిపించినా లాస్ట్ రిలీజెస్ టెంపర్ నాన్నకు ప్రేమతోతో మళ్లీ తన సత్తా చాటాడు. ఇక ఒక్క రోజు గ్యాప్ లో జనతా గ్యారేజ్ తో రాబోతున్న తారక్ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు. 


జూనియర్ కు పోటీగా సినిమా నిలబెట్టాలంటే ఎంతో స్టామినా కావాలి. స్టార్ హీరోల సినిమాలేమో కాని కుర్ర హీరోలు మాత్రం ఆ సాహసం చేయాలనుకోరు. కాని అవసరాల శ్రీనివాస్ మాత్రం ఆ సరదా తీర్చుకోవాలని చూస్తున్నాడు. తన దర్శకత్వంలో రూపొందిన జ్యో అచ్యుతానంద సినిమాను జనతా గ్యారేజ్ రిలీజ్ అయిన వారంలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.


ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ ఓ పక్క నటుడిగా మరో పక్క దర్శకుడిగా సూపర్ ఫాంలో ఉన్నాడు. ఇక రెండో ప్రయత్నంగా చేసిన జ్యో అచ్యుతానందతో ఈసారి యంగ్ టైగర్ తోనే ఢీ కొడుతున్నాడు. నారా రోహిత్, నాగ శౌర్య హీరోలుగా నటించిన ఈ సినిమాలో రెజినా హీరోయిన్ గా చేసింది. ట్రైలర్ తో మంచి ఇంటెన్స్ క్రియేట్ చేసిన అవసరాల శ్రీనివాస్ జూనియర్ కు పోటీ రావడం ఎంతవరకు సేఫ్ అన్నది ఆలోచించాలి.


ఇక ఇదే కాకుండా జనతా గ్యారేజ్ కు పోటీగా సెప్టెంబర్ 9న విక్రం ఇరుమగన్ తెలుగులో ఇంకొక్కడు కూడా రిలీజ్ అవుతుంది. జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయితే ఈ రెండిట్లో ఒకటి కచ్చితంగా రిలీజ్ అయ్యే ఛాన్సులు తగ్గినట్టే. మరి ఇరుమగన్ తమిళ్ తెలుగు ఒకేసారి రిలీజ్ చేస్తారు కాబట్టి అది ఆపే వీలు ఉండదు. కాబట్టి ఎటుకూడి జ్యో అచ్యుతానంద రిలీజ్ ఆపేస్తారేమో చూడాలి.


అయితే కాదు ఎవరి మార్కెట్ వారిది అని రిలీజ్ చేసినా చేసేయొచ్చు. సాయి కొర్రపాటి నిర్మించిన జ్యో అచ్యుతానంద సినిమా ఇప్పుడు యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించింది. అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేయడం అన్న కథతో పాటుగా బ్రదర్స్ మధ్య రిలేషన్ గురించి అవసరాల చెబుతున్న జ్యో కథేంటో చూడాలి మరి.  



మరింత సమాచారం తెలుసుకోండి: