ఈరోజు అర్ధరాత్రి దాటిన తరువాత ‘జనతా గ్యారేజ్’ స్పెషల్ షోలకు రంగం సిద్ధం అయిన నేపధ్యంలో రేపటి సూర్యోదయం లోపే ‘జనతా గ్యారేజ్’ టాక్ బయటకు రాబోతోంది.  అయితే యూకె యూఏఇలో ఇండియన్ సినిమా మేగజైన్ ఎడిటర్‌, ఫిల్మ్ క్రిటిక్‌గా, యూఏఇ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా ఉన్న ఉమైర్ సంధు నిన్న ప్రదర్శింప బడ్డ ‘జనతా గ్యారేజ్’ స్పెషల్ ప్రివ్యూ షో చూసి తన రివ్యూ రిపోర్ట్ తన ట్విటర్ లో షేర్ చేసాడు.

ఈసినిమాకు ఉమైర్ సంధు ఏకంగా 4/5 రేటింగ్ ఇవ్వడం ‘జనతా గ్యారేజ్ యూనిట్ తో పాటు జూనియర్ ను భయపెడుతోంది అని టాక్.  దీనికి కారణం ఇతడు బాగుంది అని సర్టిఫికేట్ ఇస్తే చాలు ఆ సినిమాలు అన్నీ ఘోరమైన ఫ్లాప్ లు గారుతున్నాయి.  ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘బ్రహ్మోత్సవం’ లతో పాటు రీసెంట్ గా వచ్చిన రజినీకాంత్ ‘కబాలి’ కి కూడ ఉమైర్ సింధు టాప్ రేటింగ్ ఇస్తే కలక్షన్స్ విషయంలో ఘోరమైన ఫ్లాప్ లుగా మారాయి.

ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ‘జనతా గ్యారేజ్’ యూనిట్ ను ముఖ్యంగా జూనియర్ ను వెంటాడుతోంది అని టాక్.  దీనితో ఉమైర్ సింధు ఇచ్చిన రేటింగ్ తలుచుకున్ వీరంతా భయపడి పోతున్నట్లు తెలుస్తోంది.  అయితే ఉమైర్ రేటింగ్ రిపోర్ట్ చదివితే మటుకు మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. 

ఈసినిమాలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ చూసి సినిమా చూసే ప్రేక్షకులంతా స్టన్నవ్వడం ఖాయం అంటున్నాడు.  తన నటనలో కొత్తకోణాన్ని జూనియర్ ఆవిష్కరించాడు అని అంటూ  ముఖ్యంగా అతని లుక్, మాసీ యాక్షన్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోవడం ఖాయం అని అంటున్నాడు. అంతేకాదు ఈసినిమాలో  ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనే రేంజిలో ఉంటుందని జూనియర్ అభిమానులకు చుక్కలు చూపెడుతున్నాడు ఉమైర్ సంధు. 

ఇక ఈ సినిమాకు సంబంధించి సమంత, నిత్యా మీనన్ అందం పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకున్నారు అని ఉమైర్ సంధు తెలిపాడు. విలన్ పాత్రలో ఉన్ని ముకుందన్ ఫస్ట్ రేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటూ  పక్కా లోకల్ స్పెషల్ సాంగులో కాజల్ చాలా హాట్ గా కనిపించిందని ఈ సినిమా పై అంచనాలు పెంచేసాడు ఉమైర్
ఈ సినిమా స్టోరీ ఔట్ స్టాండింగ్ గా ఉందని అంటూ ఈ సినిమా  స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అని అంటున్నాడు.  

సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో హైలెట్ అంటూ ప్రొడక్షన్ డిజైన్ ఎడిటింగ్ ఇలా అన్ని విషయాలలోనూ ‘జనతా గ్యారేజ్’ హైలెట్ అంటూ 4/5 రేటింగ్ ఇచ్చి కొన్ని గంటలలో బయటకు రాబోతున్న ఈ సినిమా ఫలితాన్ని ముందుగానే తెలియచేసాడు.  ఇంత వరకు అన్నీ బాగానే ఉన్నా ఇప్పటికే అనేకసార్లు తప్పిన ఉమైర్ సంధు అంచనాలు ఈసారి ఎంత వరకు నిజం అవుతాయో అన్నదే ప్రశ్న..  


మరింత సమాచారం తెలుసుకోండి: