రెండో సినిమాను ఖ‌రారు చేసుకున్న అఖిల్


తన నెక్ట్స్ మూవీని విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో చేస్తున్నట్లు యంగ్ హీరో అఖిల్ ప్ర‌క‌టించాడు. ఇంతకు ముందు విక్రమ్ కుమార్ అక్కినేని ఫ్యామిలీకి ‘మనం' రూపంలో మరుపురాని హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


మ‌రో సినిమాను ఫిక్స్ చేసిన ప‌వ‌న్


ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడా అనే సినిమా చేస్తోన్న బ‌ర్త్ డే బాయ్ పవన్ క‌ళ్యాణ్‌ ఈ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ విషయాన్ని పవన్- త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రానున్న సినిమాను నిర్మించే హారిక- హాసిని క్రియేషన్స్ ప్ర‌క‌టించింది.


ఆడియ‌న్స్ ముందుకు అకిరా
సౌత్ డైరెక్ట‌ర్ మురుగదాస్ బాలీవుడ్‌లో తెర‌కెక్కించిన చిత్రం ‘అకిరా’ తాజాగా ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో సోనాక్షి చేసిన ఫైట్లు సినిమాపై అంచనాలను పెంచాయి. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై తెరకెక్కిన చిత్రం కావడం.. మురుగదాస్‌ దర్శకత్వం వహించడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇంతలా ఆసక్తిని రేకెత్తించిన ‘అకిరా’ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చి అల‌రిస్తోంది.


3న ‘నారదుడు’ రాక‌

ధనుష్‌, జెనీలియా, శ్రియ ప్రధాన పాత్రల్లో జవహర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నారదుడు’. ఇప్పటికే తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు దీన్ని తెలుగులో అనువాదం చేసి శ‌నివారం విడుదల చేస్తున్నారు. 


తండ్రి ప‌వ‌న్ ఫోటో పెట్టుకోమ‌ని త‌ల్లిని కోరిన‌ కూతురు

తన తండ్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే సందర్భంగా కూతురు తల్లి రేణూదేశాయ్‌కు ఓ కోరిక కోరిందట. 'అమ్మా ఈరోజు నాన్న పుట్టినరోజు కదా, అందుకని నువ్వు ఫోన్‌లో నాన్న ఫొటో పెట్టుకోవాలి' అని చెప్పిందట. కేవలం పాప ఆనందం కోసమే ఈరోజు తన డీపీ మార్చానని రేణు ట్వీట్ చేసింది. ఇన్నాళ్లూ తన ఫొటోను ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ప్రొఫైల్‌లో పెట్టుకున్న రేణు.. కూతురు చెప్పిందని ఇవాళ పవన్‌ ఫొటోను ప్రొఫైల్‌గా పెట్టుకుంది. దీంతో హ్యాపీగా ఫీల‌యిన పవర్‌స్టార్ ఫ్యాన్స్ వదినమ్మా ధన్యవాదాలు, క్యూట్‌ డాటర్‌, సూపర్‌, నైస్‌ అంటూ తెగ కామెంట్స్‌ పెట్టేశారు.


ప‌వ‌న్‌పై ట్విట్ చేసిన ప‌వ‌న్
పవన్‌ కల్యాణ్ బ‌ర్త్ డే సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు బన్నీ. 'మెనీ మెనీ హ్యీపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ది డే టు అవర్‌ పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌' అంటూ ట్వీట్‌ చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: