దశాబ్ధ కాలంగా కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన కాజల్ అగర్వాల్, ఈ మధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచింది. క్లీవేజ్ షో లు చేస్తూ.. ఆవురావురు మంటుండే యూత్ కు గ్లామర్ విందు వడ్డిస్తోంది.  పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న కాజల్‌ పనిగట్టుకుని ఏనాడు గ్లామర్‌ విందు చేయలేదు.  కాస్త గ్లామరస్‌గా కనిపించి అభిమానులను ఊరించిందే తప్ప.. ఉసూరుమనిపించలేదు. అయితే అమ్మడు ఈ మధ్య కాస్త రూటు మార్చింది. కొత్త హీరోయిన్ల రాకతో ఇండస్ట్రీలో పోటీ పెరగిందో ఏమో కానీ... అందాలు తెగ ఆరబోస్తోంది. గ్లామర్‌ గేట్లు తెరిచి రెచ్చిపోతోంది.


జనతా గ్యారేజ్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి అందరి మతి పోగొట్టింది మిత్రవింద. జనతా గ్యారేజ్ ప్లస్ పాయింట్స్ లో కాజల్ ఐటమ్ సాంగ్ ను చేర్చాంటే.. అమ్మడు ఏమేర అందాలు కనువిందు చేసిందో అర్ధమౌతోంది. పక్కా లోకల్.. నేను పక్కా లోకల్ అంటూ.. అందరి కళ్లు తన పైనే ఫోకస్ పెట్టేలా రెచ్చిపోయింది. పాట ఆద్యంతం బొడ్డు కిందకు చీర కట్టి, మాస్ స్టెప్పులేస్తూ కుర్రాళ్ల మతి పోగొట్టింది. కాజల్ వంగి వంగి స్టెప్పులేస్తుంటే.. ఆడియన్స్ ఈలలు, కేకలతో థియేటర్లను హోరెత్తించారు.  


కాజల్ అందాల ఆరబోత ఒక్క టాలీవుడ్ కే పరిమితం కాలేదు. జనతా గ్యారేజ్ లో కాజల్ ఐటమ్ సాంగ్ పై చర్చ జరుగుతున్న వేళ.. తమిళంలో ఆమె హీరో జీవాతో కలిసి నటించిన "కవలై వేండామ్" సినిమా పాట విడులైంది. అందులోనూ అమ్మడు రెచ్చిపోయింది. స్మిమ్మింగ్ పూల్ లో తడి అందాలతో అభిమానులకు పిచ్చెక్కించింది. ఇదే సినిమాకు సంబంధించిన ఫోటో షూట్ లోనూ మరింత హాట్ గా పాల్గొంది.  బికినీలో అందాలు ఆరబోసింది. ఇన్నాళ్లు కాజల్ అందచందాలను వీక్షిచేందుకు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన అభిమానులు, లేటు వయసులోనైనా గ్లామర్ గేట్లు తెరవడంతో..  పండగ చేసుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: