‘జనతా గ్యారేజ్’ క‌లెక్ష‌న్లు: 5 డేస్ - 57 కోట్లు 


యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోహన్ లాల్ కాంబినేషన్లో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా తొలి 4 రోజుల్లోనే రూ. 50 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ మూవీ.. తొలి 5 రోజుల్లో 57 కోట్లరూపాయ‌లు వసూలు చేసింది.


'ప్రేమమ్' రిలీజ్ డేట్ ఖరారు


చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 'ప్రేమమ్' చిత్రం తెరకెక్కింది. చైతూ సరసన శ్రుతిహాసన్ .. అనుపమ పరమేశ్వరన్ .. మడోనా సెబాస్టియన్ కథానాయికలుగా అలరించనున్నారు. ఈ సినిమా నుంచి కొన్ని రోజుల క్రితం ఒక పాటను రిలీజ్ చేశారు. బ్యాంగ్ బ్యాంగ్ అనే మరోపాటను ఈ నెల 8న విడుదల చేయనున్నారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 20న ఆడియో వేడుకను నిర్వహిస్తారు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు.


మ‌రోసారి మాస్ పోలీస్ గా రెడీ అయిన‌ రవితేజ 


మాస్ రాజా రవితేజ మ‌రోసారి మాస్ పోలీస్ గా వ‌చ్చేందుకు రెడీ అయ్యాడు. 'లక్ష్మీ', 'లక్ష్యం', 'రేసు గుర్రం' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ అధినేత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) తాజాగా రవితేజ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నారు. తమ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి నిజమేనని తాజాగా నల్లమలుపు శ్రీనివాస్ చెప్పాడు. రవితేజతో తాను చేస్తోన్న తొలి సినిమా ఇదని  అన్నాడు. వక్కంతం వంశీ అందించిన కథ చాలా బాగా వచ్చిందని చెప్పాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని చెప్పుకొచ్చాడు.


శింబు జోడీగా తమన్నా


మిల్కీబ్యూటీ తమన్నా త‌మిళంలో తాజాగా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. శింబు కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాకి అధిక్ రవిచంద్రన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. శింబు సరసన తమన్నా తొలిసారిగా నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయనున్నారు.


షూటింగుకి మహేశ్ రెడీ 


సూప‌ర్ స్టార్ మహేశ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. హిందీలో 'అకీరా' సినిమా పనుల్లో బిజీగా వున్న మురుగదాస్, ఈ సినిమాకి బ్రేక్ ప్రకటించాడు. దాంతో ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిన మహేశ్, అక్కడ గౌతమ్ పుట్టినరోజు వేడుకలను జరిపాడు. నిన్న సాయంత్రమే ఆయన దుబాయ్ నుంచి తిరిగి వచ్చాడు. గురువారం నుంచి మురుగదాస్ సినిమా మేజర్ షెడ్యూల్ చెన్నైలో మొదలుకానుంది. ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి మహేశ్ రెడీ అవుతున్నాడు. వచ్చే వేసవి సెలవుల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: