పోర్న్ స్టార్ ఇమేజ్ తో బాలీవుడ్ లోకి హాట్ ఎంట్రీ ఇచ్చిన సన్నీ లియోన్ తన మార్కు చూపిస్తోంది. తన నాలుగేళ్ల కెరీర్ లో సన్నిలియోన్ కు వచ్చినంత వ్యతిరేకత ఏ హీరోయిన్ కూ రాలేదేమో.  సన్నీ.. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలిరోజుల్లో ఆమె గతం గురించి ఎన్నో అవహేళనలు ఎదురయ్యాయి. వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని ముందడుగేసింది సన్నీ. అడల్ట్‌ కామెడీ చిత్రాల నాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు మోడలింగ్ రంగంలోనూ తానేం తక్కువ కాదని నిరూపించుకుంది.


ప్రతిష్ఠాత్మక న్యూయార్క్ ఫ్యాషన్ లో సన్నీ అరుదైన ఘనత సాధించింది. ర్యాంప్ పై నడిచిన తొలి బాలీవుడ్ నటిగా పేరు తెచ్చుకుంది. డిజైనర్‌ అర్చనా కొచ్చర్‌ రూపొందించిన ప్రత్యేకమైన గౌనులో అభిమానుల కళ్లు జిగేల్ మనిపించింది. హాట్ డ్రస్ లో ర్యాంప్ పై వయ్యారాలను ఒలకబోసింది. తన అందచందాలతో అభిమానులను కట్టిపడేసింది. ఈ సందర్భంగా తన అనుభవాలను, ఫీలింగ్స్ ను అందరితో పంచుకుంది.


మోడల్‌గా ర్యాంప్‌పై నడవాలన్న తన కల తీరిందని సన్నీ ఆనందం వ్యక్తం చేసింది. చిన్నప్పట్నుంచే తనకు మోడల్‌ కావాలని ఉండేదని,  పద్దెనిమిదేళ్ల వయసులో మోడలింగ్‌ అవకాశాల కోసం ప్రయత్నించానని చెప్పింది. తాను పొట్టిగా,లావుగా ఉన్నానని హేళన చేసేవారని వాపోయింది.  మోడల్‌గా పనికిరానని మొహం మీదే చెప్పేరాని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ విమర్శలే తనలో కసిని రాజేశాయని తెలిపింది. నాడు తిరస్కరణకు గురైన పొట్టి, లావు అమ్మాయే నేడు న్యూయార్క్ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసిందని గుర్తుచేసింది. విమర్శకులకు తానిచ్చే సమాధానమిదేనని స్పష్టం చేసింది. డ్రస్సింగ్ విషయంలో తనపై వచ్చే విమర్శలను లెక్కచేయనని, కంఫర్ట్ గా ఉండే దుస్తులు ధరించడమే తనకు ఇష్టమని కుండబద్ధలుకొట్టిందీ ముద్దుగుమ్మ.


న్యూయార్క్ ఫ్యాషన్ సందర్భగా తనపై వచ్చిన మరో విమర్శకు సన్నీ సమాధానమిచ్చింది.  కొన్ని నెలల క్రితం ఓ కార్యక్రమంలో సన్నీతో కలిసి ఫోటో దిగేందుకు ప్రియాంక చోప్రా తిరస్కరించిందన్న వార్త చర్చనీయాంశమైంది. దాన్ని సన్ని, ప్రియాంక ఇద్దరు ఖండించినప్పటికీ.. విమర్శకుల నోళ్లలో నానింది. ప్రస్తుతం 'క్వాంటికో 2'  షూటింగ్ కోసం అమెరికాలోనే ఉన్న ప్రియాంక.. ఫ్యాషన్ షోకు హాజరైంది. ఈ సందర్భంగా ప్రియాంకతో కలిసిన దిగిన సెల్ఫీని సన్నీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రియాంక దాన్ని రీపోస్ట్ చేసింది. ఇప్పుడిద్దరూ ఇలా సెల్ఫీ తీసుకుని తమపై వచ్చిన విమర్శల్లో వాస్తవం లేదని నిరూపించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: