తెలుగు, తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో నయన తార ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ముందు సూపర్ స్టార్ రజినీ సరసన చంద్రముఖి చిత్రంలో స్థానం దక్కించుకున్న ఈ మళియాలీ భామ తర్వాత గజినీ చిత్రంతో సూర్య సరసన నటించింది. ఆ తర్వాత అగ్ర హీరోల సరసన నటిస్తూ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ లీస్టులో చేరిపోయింది.  ఇక తెలుగులో బాలకృష్ణ సరసన వచ్చిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచిపోయాయి.  మొదటి నుంచి ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచిన నయన తార ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్..అయినా కూడా ఈ అమ్మడికి తమిళ టాప్ హీరో షాక్ ఇచ్చారు.
Image result for nayanthara vignesh
ఇంతకీ ఎవరా హీరో అంటారా గజిని తో తెలుగు వారి మనసు దోచిన సూర్య.  ఇండస్ట్రీలోకి పది సంవత్సరాలు దాటిన హీరోయిన్ అయినా కూడా గ్లామర్ ఏమాత్రం తగ్గని నయన తార కోసం వేయిట్ చేసే దర్శక,నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు. అంతే కాదు ఈ అమ్మడికి రెమ్యూనరేషన్ కూడా భారీస్థాయిలో డిమాండ్ చేస్తుంది అయినా కూడా సూర్య ఆమెను రిజక్ట్ చేశాడట. అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం సింగం సిరీస్ లో మూడో పార్ట్ ని ఫినిష్ చేస్తున్న సూర్య, తన నెక్ట్స్ మూవీని కూడా ఫైనల్ చేసేసుకున్నాడు.
Image result for nayanthara ghajini
ఇక ఆ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్. ఇప్పటికే నయన్ తో విఘ్నేష్ పీకల్లోతుల్లో ప్రేమలో మునిగిపోయిన విషయం తెలిసిందే. అందుకే తన సినిమాలో నయన్ హీరోయిన్ గా పెట్టాలని చూస్తున్నాడట..కానీ సూర్య మాత్రం కుదరదంటున్నాడట. దీనిక కారణం గతంలో గజిని లో నయన్ తో కలిసిన నటించిన సూర్య మంచి హిట్ కొట్టినప్పటికీ తర్వాత వచ్చిన ఆధవన్ (ఘ‌టికుడు ) ,మాస్ ఘోరంగా అపజయం పొందాయి.
Image result for nayanthara surya
ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మనోడికి నయన్ తో అచ్చిరావడం లేదని వారి కాంబినేష్ జనాలకు అంతగా నచ్చడం లేదని అంటున్నాడు.  అందుకే నయన్ ని క‌థానాయిక‌గా తీసుకునేందుకు సూర్య ససేమిరా అంటున్నాడట. మరి నయనతార ప్రస్తుత లవర్ విఘ్నేష్ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: