సినిమా ఇండస్ట్రీలో చాన్స్ రావడమే గొప్ప అనుకునే ఈ కాలంలో నటిగా మంచి గుర్తింపు వస్తున్న సమయంలో క్యాన్సర్ రూపంలో ఆ హీరోయిన్ జీవితాన్ని అగమ్యగోచరంగా చేసింది. దీంతో చైనా సాంప్రదాయం ప్రకారం వైద్యం చేయించుకోవాలన్న ఆమె ఆశ చివరకు చనిపోయేలా చేసింది. చైనీస్ సినీపరిశ్రమలో వర్ధమాన నటిగా పేరు తెచ్చుకున్న  జు టింగ్ (26) మంచి ఫామ్ లో ఉండగా ఆమెకు క్యాన్సర్ సోకింది. జులై 9న తనకు క్యాన్సర్ ఉందని ట్వీట్ చేసింది.   లింఫోమియా బారీన పడిన జు టింగ్ జబ్బును నయం చేయించుకునేందుకు ఆధునిక వైద్యవిధానాన్ని కాదనుకుని సంప్రదాయ చైనీస్ వైద్యవిధానాన్ని ఆశ్రయించారు.  'కీమోథెరపీ అత్యంత బాధాకరం.
వైద్యం వికటించి చైనీస్‌ నటి మృతి
నాకు తెలిసినవాళ్లలో క్యాన్సర్ బారిన పడిన కొద్దిమంది కీమో చేయించుకు ఎంత నరకం అనుభవించారో గుర్తుంది. అందుకే క్యాన్సర్ ఉందని తెలియగానే నేను కీమోథెరపీ కాకుండా చైనీస్ సంప్రదాయ వైద్యవిధానంలో కేన్సర్‌ను తగ్గించుకోవాలనుకున్నా' అని మరో ట్వీట్ చేసింది.  ఆ తర్వాత ఆసుపత్రిలో చేరిన తర్వాత కప్పింగ్‌ థెరపీ చేయించుకుంటున్నప్పుడు తీయించుకున్న ఫొటో ఒకదానిని ఆమె పోస్ట్ చేశారు.  కానీ ఆగస్టు 18 నాటికి జు టింగ్ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. 'చైనీస్ వైద్యం కూడా కీమోథెరపీలా బాధాకరంగానే ఉంది` అంటూ ఆమె చివరి సారి పోస్ట్ చేసింది.
వైద్యం వికటించి చైనీస్‌ నటి మృతి
తర్వాత కొద్దిరోజులకే ఆమె మృత్యువు ఒడిలోకి జారుకుంది.  చైనా సాంప్రదాయం ప్రకారం  కప్పింగ్ థెరపీ, సూదులను శరీరంలోకి గుచ్చే పద్ధతి తదితర సంప్రదాయ విధానాలన్నీ బెడిసికొట్టడం వల్లే ఇలా జరిగిందని జు టింగ్‌ సోదరి విలేకరులకు తెలిపారు.దీంతో జు టింగ్ మరణం గురించి చైనా వ్యాప్తంగా చర్చ మొదలైంది. 

వైద్యం వికటించి చైనీస్‌ నటి మృతి


మరింత సమాచారం తెలుసుకోండి: