మోహన్ బాబు...తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయనదో విభిన్న శైలి. మోహన్ బాబు ఏం చేసినా సంచనలమే. ఆన్ స్క్రీన్ మీదే కాదు, ఆఫ్ స్క్రీన్ లోనూ ఆయన పెదరాయుడులా వ్యవహరిస్తారనే పేరుంది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. ఏం చెప్పాలనుకున్నా మొహం మీదే కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేస్తారు. వైజాగ్ లో సుబ్బిరామిరెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మోహన్ బాబు 40 సంతవ్సరాల సినీ ప్రస్థాన సన్మాన కార్యక్రమం ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. 

40సంవత్సరాల సినీ ప్రస్థాన సన్మాన కార్యక్రమంలో మోహన్ బాబు పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. తన తోటి కథా నాయిక జయప్రదను చూసి మనసులో మాటను బయటపెట్టేశారు. జయప్రద వాట్ బ్యూటీ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఎంతో మంది కొత్త కొత్త హీరోయిన్లు వస్తున్నారని వారెవరూ జయప్రదకు సాటి రారని కొనియాడారు. పక్కనే నా భార్య ఉంది అంటూనే.. తాను అప్పుడప్పుడూ జయప్రదను చూసినప్పుడు లొట్టలేసుకుంటూ ఉంటానని మనసులో మాట బయటపెట్టేశారు. 


అంతటితో ఆగకుండా జయప్రదపై మోహన్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. తాను అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్నప్పుడే జయప్రద హీరోయిన్ అని చెప్పారు. ఆమెతో హీరోగా, విలన్ గా నటించిన సినిమాల గురించి గుర్తు చేసుకున్నారు. తన 40సంవత్సరాల సినీ ప్రస్థాన సన్మాన కార్యక్రమం కోసం ఎంతో దూరం నుండి రెండు మూడు విమానాలు మారుతూ వచ్చిన జయప్రదకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మోహన్ బాబు, జయప్రదపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నంత సేపు ఆయన సతీమణి నవ్వుతూనే ఉండటం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: