బోణి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి కర్బందా ఏ సినిమా చేసినా అమ్మడికి రిజల్ట్ మాత్రం ఫ్లాపులే వచ్చాయి. అందుకే చిన్నగా కన్నడ పరిశ్రమకు చేరుకున్న అమ్మడు అక్కడ కాస్త కెరియర్ మీద పట్టు సాదించింది. ఇక రీసెంట్ గా బాలీవుడ్ సీనియర్ కిస్సర్ ఇమ్రాన్ హష్మితో రాజ్ రీబూట్ లో నటించిన కృతి ఆ సినిమాతో అక్కడ మంచి హిట్ కొట్టింది. ఇక ఆ హిట్ తో మళ్లీ క్రేజ్ సంపాదించిన అమ్మడు ఏకంగా మహేష్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.


అయితే ఇక్కడ మహేష్ అంటే మన సూపర్ స్టార్ మహేష్ కాదులేండి.. కన్నడ సక్సెస్ ఫుల్ మూవీ మేకర్ మహేష్ డైరక్షన్లో సినిమా ఛాన్స్ అందుకుంది ఈ అమ్మడు. తెలుగులో ఫ్లాపులు వెంటాడుతున్న సమయంలో అమ్మడికి అక్కడ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు మళ్లీ ఆమెకు ఓ ఛాన్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. ప్రేం అడ్డాతో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు మళ్లీ చేయబోయే సినిమాకు పనిచేయబోతున్నారు.


రాజ్ రీబూట్ తో బాలీవుడ్లో కూడా పర్వాలేదు అనిపించుకున్న కృతి కర్బందా ఈ ఛాన్స్ అన్ని విధాలుగా వాడుకోవాలని చూస్తుంది. ఇక కోలీవుడ్లో కూడా అమ్మడి హవా కొనసాగుతుంది. కెరియర్ లో ఇప్పుడిప్పుడే సక్సెస్ జోష్ ఎంజాయ్ చేస్తున్న కృతి వీలైతే తెలుగులో ఇప్పటికి నటించేందుకు రెడీ అంటుంది. కాని తెలుగులో అమ్మడిది ఐరన్ లెగ్ సెంటిమెంట్ మరి అంత సాహసం చేసి ఎవరు ఆమెను తీసుకుంటారు చెప్పండి.


టాలీవుడ్ కాకుండా అమ్మడు మిగతా ఇండస్ట్రీల్లోనే తనకు మంచింది. మరి కాస్త కొత్తగా మరింత ఉత్సాహంగా అనిపిస్తున్న కృతి కెరియర్ ఇదే రేంజ్లో కొనసాగి ఓ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: