సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు, పర్సనల్‌ లైఫ్‌ విశేషాలు, వీడియోలు, ఫోటోలు అంటే చాలు అందరూ ఎగబడి చూస్తుంటారు. అదే వారి పాలిట శాపంగా మారుతోంది. ఇక సినీ హీరోయిన్లు, యాంకర్ల ప్రూవేట్‌ లైఫ్‌కు ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. వారి వ్యక్తిగత విషయాలను శోధించి, ఆసాంతం తెలుసుకోవాలని తెగ తాపత్రయ పడుతుంటారు కొందరు. కానీ వారి ప్రైవసీకి ఇబ్బంది కలుగుతోందని ఏమాత్రం ఆలోచించరు. 


ఈమధ్యకాలంలో ఈ దోరణి మరింత శృతిమించుతోంది. వారికి తెలియకుండా హీరోయిన్స్ కి సంబందించిన వ్యక్తిగత ఫోటోలు - వీడియోలు సోషల్ నెట్ వర్క్స్ లోకి ఎక్కేస్తున్నాయి. వాటిని నిమిషాల వ్యవధిలోనే లక్షల మంది షేర్‌ చేసేస్తున్నారు. దీంతో సదరు సెలబ్రెటీలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వాటిలో హీరోయిన్స్ స్నానాలు చేస్తున్నవి, భాయ్‌ ఫ్రెండ్స్‌తో క్లోజ్‌గా ఉన్నవి ఇలా ఏవి పడితే అవి అంతర్జాజంలోకి ఎక్కేస్తున్నాయి.  గతంలో కొందరు ఆకతాయిలు ఓ హీరోయిన్‌ స్నానం చేస్తున్న వీడియో తీసి నెట్ లో పెట్టి ఆ హీరోయిన్‌ పరువు తీశారు. అవేగాక హీరోయిన్స్ బట్టలు మార్చుకుంటున్నప్పటి ఫోటోలు ఇలా రకరకాలుగా ఫోటోలు - వీడియోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.


 ఈ విషయాలు బయటకు వచ్చినప్పుడు..ఆ హీరోయిన్స్‌ పడే బాధ ఇంతా అంతా కాదు. కానీ చాలా మంది సెలబ్రెటీలు ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అవి తమవి కావని చెప్పుకుని లోలోపల బాదపడే వారు కొందరైతే... వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేసేవారు తక్కువే.  ఇదే క్రమంలో తాజాగా మరో హీరోయిన్ ఈ ప్రైవేటు ఫోటోల లీక్ బారిన పడింది.


సైబర్ నేరగాళ్ల పనో, లేక తెలిసిన వారి పనో తెలియదు కానీ... ఒక కన్నడ హీరోయిన్ కి సంబందించిన పర్సనల్ ఫోటోలు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఆకతాయిల చేష్టలకు కన్నడ హీరోయిన్ సోనూ గౌడ్ బలైంది. ఆమెకు సంబందించిన వ్యక్తిగత ఫోటోలు నెట్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. సోను గౌడ తన భర్త మనోజ్ గౌడతో సన్నిహితంగా గడుపుతుండగా తీసినప్పటివి ఆ ఫోటోలు ఇప్పుడామెకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.


ఈ విషయాలపై స్పందించిన ఆ హీరోయిన్... తన భర్తతో తాను సన్నిహితంగా గడుపుతున్నప్పుడు ఎవరో రికార్డు చేసి ఫోటోలు తీశారేమో అని వాపోయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సైబర్ సెల్ కు కంప్లైట్ చేసింది సోను. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: