బాలీవుడ్లో ఓ హీరో తన కెరియర్ లో 24 ఏళ్ల తర్వాత తొలి లిప్ లాక్ చేశాడు. కాస్త నమ్మశక్యంగా లేదు కదా కాని ఇది నిజమండి బాబు యాక్షన్ హీరో అజయ్ దేవగన్ తన కెరియర్ లో ఇప్పటిదాకా ఏ హీరోయిన్ కు లిప్ కిస్ ఇచ్చింది లేదు. కాని ప్రస్తుతం నటిస్తున్న శివాయ్ లో తన హీరోయిన్ పెదాలను జుర్రేసుకున్నాడట.. బాలీవుడ్ లో ముద్దు ముచ్చట్లు కామనే.. స్క్రీన్ మీద రొమాన్స్ అనేది అక్కడ సర్వ సాధారణం కాని ఈ విషయంలో ఇప్పటిదాకా కాస్త దూరంగా ఉన్నాడు అజయ్ దేవగన్.  


అయితే తొలిసారి తను ఓ హీరోయిన్ తో లిప్ లాక్ సీన్లో నటించాడు అది కూడా తాను నిర్మిస్తున్న సినిమా శివాయ్ కోసం. సినిమాలోని సీన్ డిమాండ్ చేసింది కాబట్టి లిప్ లాక్ చేశానని లేకుంటే చేసేవాడిని కాదని అంటూ కబుర్లు చెబుతున్నాడు అజయ్ దేవగన్. సయేషా సైగల్, ఎరికా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీన్ అవసరం మేరకు హీరోయిన్ ఎరికాతో అదర చుంభనం కానిచ్చేడట.


సో మొత్తానికి 47 ఏళ్ల వయసులో లిప్ లాక్ తో అదరగొట్టేశాడు అజయ్. మొదటి నుండి శివాయ్ సినిమా మీద వస్తున్న రూమర్లంటికి సినిమా సమాధానం చెబుతుందని అంటున్నాడు. తానే నిర్మాతగా ఈ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అంటున్న అజయ్ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అన్న నమ్మకం వెళ్లబుచ్చారు.


అక్టోబర్ 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. అయితే ముద్దు సీన్లో అజయ్ సిగ్గుపడుతుంటే ఆ సీన్ చేసినందుకు ఎరికా గర్వపడుతుంది. అంతేకాదు సీన్ డిమాండ్ చేస్తే ఎలాంటి రొమాన్స్ కు అయినా తాను సిద్ధమే అంటూ చెప్పుకొచ్చింది. మరి అజయ్ ముద్దుముచ్చట్లతో తీసిన ఈ సినిమా ఏ రేంజ్లో వసూళ్లను రాబడుతుందో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: