ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా వినిపిస్తున్న న్యూస్ ఏమైన ఉందంటే అది అక్కినేని నాగచైతన్య పెళ్లి వ్యవహారమే. అక్కినేని వర్గానికి సంబంధించిన వారు దాదాపు ఆ న్యూస్ కన్ఫర్మ్ అని అంటుంటే…మరికొందరు మాత్రం ఛాన్స్ లేదని అంటున్నారు. అయితే ఫిల్మ్ నగర్ లో నాగచైతన్య, సమంతలకి సంబంధించిన న్యూస్ పై మరింత హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…అక్కినేని నాగచైతన్య, సమంతకి సంబంధించిన ప్రేమ వ్యవహారం గత కొంత కాలంగా చర్ఛ జరుగుతుందనే విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనేదానిపై మాత్రం కన్ఫర్మ్ లేదు. ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రం వీరిద్దరూ లవ్ లో ఉన్నారు అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే…ఈ వార్తలపై నాగచైతన్య సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు.


కొన్ని రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ ప్రవైట్ ఈవెంట్ లో తనపై వస్తున్న సమంత మేటర్స్ కి కొంతమేర నిజమే అన్నట్టుగా సమాధానం ఇచ్చాడు. అలాగే తాజాగా ప్రేమమ్ మూవీ ఆడియో ఫంక్షన్ లో దాసరినారాయణరావు చేసిన పెళ్ళి వాఖ్యలపై నాగచైతన్య చిరునవ్వుతో సమాధానం ఇచ్చి మరోసారి కన్ఫర్మ్ చేశాడు. ఇక దాసరి చేసిన కామెంట్స్ కి అక్కినేని ఫ్యామిలీ నుండి ఎవ్వరూ కౌంటర్ ఇవ్వకపోవటం కూడ సమంతతో నాగచైతన్య పెళ్లి కన్ఫర్మ్ అనే వార్తలకి బలాన్ని చేకూర్చుతుంది.


ఇదిలా ఉంటే వెరీ రీసెంట్ గా సమంత…తన క్లోజ్ ప్రెండ్స్ కి అక్కినేని నాగచైతన్యతో పెళ్లి అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసిందని అంటున్నారు. చెన్నైలో దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఘాటుగా వినిపిస్తుంది. సమంత నుండి వచ్చిన ఈ  కన్ఫర్మేషన్ ని సాధ్యమైనంత ఎక్కువుగా వీరి స్నేహితులు పబ్లిక్ లోకి తీసుకువెళుతున్నారు. ఇదిలా ఉంటే ఎటువంటి అఫిషియల్ స్టేట్మెంట్ బయటకు రాకుండానే చాలా మంది సమంతకి కంగ్రాట్స్ చెప్పటం ఇక్కడ విశేషంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: