స్టార్ హీరో రామ్ ప్రస్తుతం నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ ‘హైపర్’. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ యాక్టివీటిస్ శరవేగంగా జరుగుతున్నాయి.‘నేను శైలజా’ వంటి మంచి విజయం తరువాత రామ్ చేస్తున్న చిత్రం ‘హైపర్’ పై ఇండస్ట్రీ నుండి పాజిటివ్ టాక్స్ మొదలైనాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అన్నీ పాటలను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రామ్ రిలీజ్ చేశాడు. ఇక తాజాగా రామ్ లాంచ్ చేసిన ‘హైపర్’ థియోట్రికల్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.


ఫ్యాన్స్ నుండి సైతం ‘హైపర్’ థియోట్రికల్ ట్రైలర్ బాగుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. అయితే ‘హైపర్’ థియోట్రికల్ ట్రైలర్ చూసిన అనంతరం ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ కి ఒక గుడ్ న్యూస్…ఒక బ్యాడ్ న్యూస్ లు ఎదురవుతున్నాయని అంటున్నారు. వీటి వివరాలను చూస్తే…‘హైపర్’మూవీ మంచి క్యాలిటీ ప్రొడక్షన్ తో తెరకెక్కింది. కథ విషయంలోనూ మంచి క్లారిటీ ఉందనే విషయం అర్ధం అవుతుంది. ఫ్యామిలీయాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులకి బాగా నచ్చుతుందనేది ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం.


అయితే నేనుశైలజా మూవీతో లాభాలను చూసిన డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీని తక్కువ రేటుకి కొనాలని చూస్తున్నారు. అయితే ‘హైపర్’ మూవీకి కాస్త బడ్జెట్ ఎక్కువుగా ఉండటంతో…దాన్ని డిస్ట్రిబ్యూటర్స్ పై రుద్దుతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఏ రైట్స్ అయినా కాస్త ఎక్కువుగా ఉన్నాయని అంటున్నారు. దీంతో డిస్ట్ట్రిబ్యూటర్స్ కాస్త వెనకంజ వేస్తున్నారు. నేనుశైలజ మూవీకి ఎటువంటి రైట్స్ ఉన్నాయో…ఆ రైట్స్ ప్రకారమే ‘హైపర్’కి తీసుకొంటామని చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు.


కానీ నిర్మాత ‘హైపర్’ మూవీకి కాస్త ఎక్కువుగా చెప్పటంతో ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ నెమ్మదిగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా హిందీ హక్కులు పెద్ద మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది. బాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఈ హక్కులను రూ. 2 కోట్లు తీసుకుందని అంటున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ మూవీని నిర్మించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: