తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ మరుపు రాని మరువలేని చిత్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇక బాపు తీసిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ముత్యాల ముగ్గు’. ఈ చిత్రంలో ఒక పేద మహిళలను గొప్పింటి అబ్బాయి మొదటి చూపులోనే ఇష్టపడటం..తర్వాత పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకు వెళ్లడం జరుగుతుంది. కానీ అక్కడ కొంతమంది దుర్మార్గులు పథకం ప్రకారం ఆమెపై పతిత అని అపవాదు వేసి భర్తకు అనుమానం వచ్చేలా చేసి ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేస్తారు. దాంతో భర్త తాగుడికి బానిస కావడం ఆమె అప్పటికే నిండు గర్భవతి కావడంతో ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుంది. ఇక్కడ దర్శకులు బాపు అద్భుతమైన మలుపు తిప్పుతాడు..సాక్షాత్తు హనుమానుంతుడే సీన్ లోకి ఎంటర్ అవుతాడు.
Image result for mutyala muggu movie
పిల్లలకు ఎప్పటికప్పుడు సహాయంగా ఉంటూ ఆ దుర్మార్గులకు బుద్ది చెప్పి తిరిగి భార్యా భర్తలు కలిసేలా చేస్తారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు మన మద్య జరుగుతున్న ఓ సామాన్యమైన కుటుంబ కథగా చాలా నేచురల్ గా అనిపిస్తుంది. ఇందులో పాటలు కూడా ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగీత అద్భుతమైన నటన కనబరిచింది. సంగీతమ ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విశ్వేశ్వర రావు ప్రోత్సాహం తో సినిమా రంగంలోకి వచ్చానని , బాపు గారి ముత్యాల ముగ్గు చిత్రం ముందుగా రిలీజ్ అయ్యిందని ఇప్పటి వరకు 600 చిత్రాల్లో నటించానని అన్నారు. అయితే అందులో హీరోయిన్ గా అగ్ర నటులతో నటించినట్లు..తర్వాత కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించినట్లు తెలిపారు.
Image result for kcr
ఇప్పటి వరకు చెన్నైలో ఉంటున్న సంగీత ఈ మద్య హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. సంగీత స్వస్థలం వరంగల్ కావడంతో ప్రస్తుతం ఆమె రాజకీయాల్లోకి రావలనుకొంటున్నట్లు అధికార పక్షం అయిన టీఆర్ఎస్ పార్టీ తరుపు నుంచి పని చేయడానికి సిద్దంగా ఉన్నానని త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలుస్తానని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: