ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో సినిమా షూటింగ్ మొదలు పూర్తి అయ్యే వరుకు దానికి సంబంధించిన ఫోటోస్, షూటింగ్ స్పాట్స్, సాంగ్స్ లీక్, స్టోరీ లీక్ అంటూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక సినిమా పూర్తి అయిన తర్వాత రిలీజ్ కి ముందే నెట్ లో దర్శనమిస్తున్న  సంఘటనలు కూడా చాలా చూశాం. అయితే ఇలాంటి సంఘటన వల్ల సినిమాలపై క్యూరియాసిటీ కొంత పెరిగితే దర్శక నిర్మాతలు మాత్రం బెంబేలెత్తున్నారు. ప్రస్తుతం నట సింహం నందమూరి బాలకృష్ణ, క్రియేటీవ్ దర్శకులు క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రానికి సంబంధించి టైటిల్ సాంగ్ లీక్ అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Image result for gowthami putra satakarni shooting photos
నందమూరి బాలకృష్ణ తన 100 వ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు భారత దేశంలో గొప్ప రాజుల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న మహా వీరుడు గౌతమి పుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..ప్రస్తుతం మధ్య ప్రదేశ్‌లోని ఓ కోటలో బాలయ్యతో పాటు శ్రేయ, హేమమాలిని తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలతో పాటు రాజ‌సూయ‌ యాగం చిత్రీక‌ర‌ణ‌ను తెరకెక్కించాడు.  
Image result for gowthami putra satakarni shooting photos
భార‌తాన్ని ఏక‌తాటిపై తేవడానికి పురాణాలలో ధర్మరాజు, చారిత్రాత్మకంగా శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రమే ఈ యాగాన్ని నిర్వ‌హించారు.  ఇదే సమయంలో శాత‌కర్ణి త‌న త‌ల్లి గౌత‌మి పేరును త‌న పేరు ముందు ఉంచుకుని త‌న పేరుని గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిగా మార్చుకున్నారు. ఆ రోజునే కొత్త యుగానికి ఆది ఉగాది అని ప్ర‌కటించారు.
Image result for gowthami putra satakarni shooting photos
అప్ప‌టి నుండి అదే రోజున ఉగాది పండుగ‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  ఇక ఈ పాట ఎలా లీక్ అయ్యిందన్న విషయంపై చిత్ర యూనిట్ మల్లగుల్లాలు పడుతుంది. ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ సినిమాటో గ్రఫీ అందిస్తోండగా, చిరంతాన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: