తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. అయితే మొదటి చిత్రం ‘గంగోత్రి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బన్ని ఆ సినిమాలో పెద్దగా ఎక్స్ పోజ్ కాకున్నా తర్వాత వచ్చిన దేశముదురు, బన్ని,ఆర్య లాంటి చిత్రాల్లో తన స్టామినా ఏంటో చూపించాడు. డ్యాన్స్, ఫైట్స్ లో తనదైన స్టైల్ చూపించి స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.  ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్న అల్లు అర్జున్ ఈ సంవత్సరం బోయపాటి దర్శకత్వంలో నటించిన ‘సరైనోడు’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఒక్క తెలుగులోనే కాకుండా మళియాల ఇండస్ట్రీలో కూడా దుమ్మురేపింది.
Image result for lingu swamy allu arjun
ఈ మద్య హీరోలు కాస్త నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తూనే హీరోయిజాన్ని చూపిస్తున్నారు. గత సంవత్సరం వచ్చిన ‘పటాస్’, ‘టెంపర్’ ఇలాంటి చిత్రాలే. తాజాగా బన్నీ కూడా నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయబోతున్నాడట. ఇప్పటికే తమిళ హీరోలు కూడా ఇలాంటి పాత్రలతో మంచి హిట్స్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. లింగు స్వామి తెరకెక్కించనున్న ఈ చిత్రం బైలింగ్యుయల్ మూవీగా తెరకెక్కనుండగా ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. ఒక పాత్ర చాలా స్టైలిష్ గా ఉండబోతుందట..మరో పాత్ర మాత్రం చాలా నెగిటీవ్ గా కనిపించబోతుందట.
Image result for sarrainodu
అయితే ఆ పాత్ర అందరిని అలరించడం ఖాయని యూనిట్ భావిస్తోంది. జ్ఞానవేల్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందట. అయిత తన పాత్ర కోసం అల్లు అర్జున్ కాస్త బరువు పెరిగి ఆ పాత్రకు తగ్గట్టుగా తన బాడీ మలచుకునేందుకు డైలీ జిమ్ కి వెళ్తున్నాడట. ఏది ఏమైనా హీరోలు ఈ మద్య ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. 

bunny plays a negative shade role


మరింత సమాచారం తెలుసుకోండి: