పవన్ ‘జనసేన’ పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన నేపధ్యంలో పవన్ పొలిటికల్ ఎంట్రీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుంది అదేవిధంగా పవన్ అభిమానుల స్పందన పవన్ పట్ల ఎలా ఉండబోతోంది అన్న విషయమై తమ్మారెడ్డి భరద్వాజ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత ఆసక్తి దాయకంగా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్  ఇండస్ట్రీలో ఎంత పేరు ఉందో డానికి మించి చాల ఎక్కువ స్థాయిలో పవన్ కు తన అభిమానులలో విపరీతమైన క్రేజ్ ఉందని కామెంట్ చేసాడు తమ్మారెడ్డి. పవన్ కనుక ఒక విషయాన్ని పట్టుకుని రోడ్డు మీదకు వస్తే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోతుందని వ్యాఖ్యానించాడు తమ్మారెడ్డి. పవనిజమ్ అంటూ రోడ్డు మీదకు వచ్చే పవన్ అభిమానుల వీరాభిమానం ఒక విధమైన మూర్ఖతతో కూడుకున్నదని అంటూ పవన్ అభిమానులను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసాడు తమ్మారెడ్డి. 

అయితే పవన్ ఒక ఉద్యమం చేపట్టి రోడ్డుమీదకు వచ్చిన తరువాత ఆ ఉద్వేగంలో అభిమానులు పవన్ చెప్పే మాటలు కూడ వినరని అంటూ దీనికి ఉదాహరణగా పవన్ కాకినాడ బహిరంగ సభలో జరిగిన సంఘటనను ఉదాహరించాడు తమ్మారెడ్డి.  చెట్లు పైకి ఇళ్ళ పైకి ఎక్కిన తన అభిమానులులను కిందకు దిగమని పవన్ పలుసార్లు చెప్పినా పవన్ అభిమానులు పట్టించుకోని సoదర్భాన్ని గుర్తుకు చేస్తూ ఒక వీరాభిమాని చనిపోయిన ఉదాహరించాడు తమ్మారెడ్డి.

ఇదే సందర్భంలో పవన్ వీరాభిమానుల గురించి మాట్లాడుతూ పవన్ కన్నా రెచ్చిపోయిన ఆవేశంతో అడుగులు వేసే ఈ అభిమానులు తన కంటికి విపరీతమైన ఆవేసపరులులా కనిపిస్తారు అంటూ మరో సంచలన వ్యాఖ్యలు చేసాడు.  ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉన్న 180 అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రతిచోటా కనీసం పవన్ కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడే 5000 మంది యువకులు ఒక ఆర్మీ ఫోర్స్ లా ఉంటారని వీరివల్ల ఎంత మంచి జరుగుతుందో తాను చెప్పలేకపో యినా వీరి ఆవేశం వల్ల  చాల నష్టాలు ఆస్కారం ఉండి అంటూ మరొక సంచలనాత్మ కామెంట్స్ చేసాడు తమ్మారెడ్డి.

పవన్ అభిమానులలో చాలామంది 18 సంవత్సరాల లోపు వారే అంటూ తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ ను బట్టి చూస్తూ ఉంటే పవన్ ‘జనసేన’ ఎన్నికలకు వచ్చే సమయానికి వీరంతా ఓటర్లుగా మారే నేపధ్యంలో పవన్ ఒక క్రియాత్మక శక్తిగా మారే విషయంలో ఎటువంటి సందేహం లేకపోయినా పవన్ కు మించిన ఆవేశంతో అడుగులు వేసే అభిమానులను పవన్ ఎంత వరకు నియంత్రిoచగలడు అన్న సందేహాన్ని వ్యక్త పరిచాడు తమ్మారెడ్డి.

ఈయన వ్యక్త పరిచిన అభిప్రాయాలు పవన్ వీరాభిమానులకు కష్టం కలిగించినా తమ్మారెడ్డి చెప్పిన మాటలలో కొన్ని నిజాలు ఉన్నాయి అన్నది మాత్రం వాస్తవం అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: