తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ అంటే ఇప్పుడు ప్రత్యేక ఇమేజ్ ఉన్న హీరో. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన ఒక్క చాన్స్ వస్తే చాలు అనుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. మెగాస్టార్ సరసన హీరోయిన్ చాన్స్ వచ్చిందీ అంటే ఇండస్ట్రీలో మంచి టర్నింగ్ పాయింట్ వచ్చినట్లే. తాజాగా ఆ క్రేజ్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సంపాదించాడు. ఇప్పుడు పవన్ సరసన నటించడానికి హీరోయిన్లు పోటీ పడుతున్నారు. ఈ సంవత్సరం సర్ధార్ పాపారాయుడు లాంటి డిజాస్టర్ చవిచూసిన పవన్ రాబోయే చిత్రంపై మంచి శ్రద్ద వహిస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాగ్ డ్రాప్ లో ఉండే ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Image result for romance heroine Manasa
పవన్ కళ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా ‘కాటమ రాయుడు ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహిస్తుండగా..శరత్ మారార్ నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో పవన్ తమ్ముడిగా క‌మ‌ల్ కామ‌రాజు ఎంపిక‌వ్వ‌గా అతడి సరసన మాన‌స హిమవర్ష నటిస్తోంది. ఈ అమ్మడు రొమాన్స్ అనే చిత్రం తో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాన్ సినిమాలో చాన్స్ దక్కించుకోవడంతో తెగ మురిసిపోతుంది.
Image result for katama rayudu posters
కోలీవుడ్‌లో అజిత్ హీరోగా శివ డైరెక్‌న్‌లో తెర‌కెక్కిన వీర‌మ్ సినిమాను మార్పులు- చేర్పులు చేసి తెలుగు నేటివిటికీ అనుగుణంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. కాట‌మ‌రాయుడులో ప‌వ‌న్ ఫ్యాక్ష‌న్ లీడ‌ర్‌గా న‌టిస్తుండ‌గా అత‌డి ప‌క్క‌న శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. దేవిశ్రీప్ర‌సాద్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: