చిరంజీవి తన 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తి అయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈసినిమా షూటింగ్ వ్యవహారాలను మరింత స్పీడ్ పెంచడమే కాకుండా ఈ సినిమా షూటింగ్ వ్యవహారాలు అన్నింటిని నవంబర్ చివరకు పూర్తిచేసి ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ను డిసెంబర్ మూడవ వారంలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమా విడుదల విషయంలో ఆఖరి నిముషం హడావిడి లేకుండా చిరంజీవి తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడ ఇప్పటికే మొదలు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఈ పరిస్థుతులు ఇలా ఉండగా రామ్ చరణ్ రంగంలోకి దిగి ఈసినిమాకు ఫిక్స్ చేసిన 100 కోట్ల టార్గెట్ బిజినెస్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం చిరంజీవి 150వ సినిమాను ఎట్టి పరిస్తుతులలోను 100 కోట్లకు తక్కువ కాని విధంగా మార్కెట్ చేయడానికి చరణ్ కృతనిశ్చయంతో ఉన్నట్లు టాక్.  దీనికి కారణం పవన్ మహేష్ ల సినిమాలకు జరుగుతున్న బిజినెస్ అని అంటున్నారు.

లేటెస్ట్ గా మహేష్ మురగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ ఆంధ్రా సీడెడ్ నైజాం హక్కులు 80 కోట్లకు అమ్మడం జరిగింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో చిరంజీవి
150వ సినిమాకు తాను పెట్టుకున్న 100 కోట్ల బిజినెస్ టార్గెట్ చాల చిన్నది అన్న భావనలో చరణ్ ఉన్నట్లు ఫిలింనగర్లో వార్తల హడావిడి చేస్తున్నాయి.
దీనితో ‘ఖైదీ నెంబర్ 150’ ని కొనుక్కోవడానికి ఉత్సాహం చూపెడుతూ ఆంధ్రా సీడెడ్ నైజాం ప్రాంతాల నుండి 

వస్తున్న బయ్యర్లు ఈసినిమా రెట్ల విషయంలో చరణ్ చూపెడుతున్న చుక్కలకు బెదిరి పోతున్నట్లు టాక్.  అంతేకాదు 9 సంవత్సరాల తరువాత చిరంజీవి నటిస్తున్న 150వ సినిమాకు క్రేజ్ ఉన్నా ఆ క్రేజ్ భారీ కలక్షన్స్ గా మారడానికి ఒక విషయంలో చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ వెనక పడుతోంది అన్న కామెంట్స్ తమలోతాము చేసుకుంటున్నట్లు టాక్. 

ఫిలింనగర్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం సినిమాలు చూస్తున్న ఎక్కువమంది 1998 – 2000 సంవత్సరాల మధ్య పుట్టినవారు కావడంతో 2008 సంవత్సరానికే సినిమాల నుంచి దూరం అయిన చిరంజీవి క్రేజ్ ప్రస్తుతం సినిమాలు విపరీతంగా చూస్తున్న 16 -18 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న యూత్ లో ఉండని నేపధ్యంలో చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ కి అద్భుతమైన టాక్ వచ్చినా చరణ్ ఆశిస్తున్న 100 కోట్ల బిజినెస్ స్థాయికి తగ్గ కలక్షన్స్ వస్తాయా ? అన్న సందేహాన్ని చరణ్ వద్ద బయ్యర్లు వ్యక్త పరుస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: