హీరోయిన్లు అందాల ఆరబోతకు ఆన్ స్క్రీనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ ప్రాధాన్యమిస్తున్నారు. సినిమా, ఆడియో ఫంక్షన్లలో తళుకు, బెళుకు డ్రస్సులతో స్కిన్ షో చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. టాలీవుడ్ లో పరవాలేకున్నా.. బాలీవుడ్ లో బరితెగించేస్తున్నారు. అంగ ప్రదర్శనలో కొందరు లిమిట్ లో ఉంటే.. మరికొందరు అంతా ఓపెన్ అంటున్నారు. చూసే వాడికి లేని సిగ్గు చూపించే వాళ్లం మాకెందుకన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోకే చేరిపోయిందీ కంగనా రనౌత్.


కంగనా రనౌత్.. చూడగానే కర్లీ హెయిర్ తో బబ్లీగా ఉంటుంది. ఏ డ్రస్సులు వేసినా అందంగా ఉంటుంది. ఆమె కూడా ఎప్పుడూ కొత్త కొత్త డ్రస్సులతో అభిమాలను అలరించే ప్రయత్నం చేస్తుంది. ఏ డ్రెస్ వేసినా కంగనా సూపర్ అని కితాబిచ్చేస్తుంటారు ఆమె అభిమానులు. అయితే ఇటీవల అమ్మడులో కొత్తదనం మరీ ఎక్కువైంది. వేషధారణలో వెర్రితనం పెరిగింది. ఓ ఫంక్షన్ కు హాజరైన కంగనాను చూసి అభిమానులు షాక్ తిన్నారు. కళ్లు పెద్దవి చేసి చూస్తూ.. కంగనా ఓపేనే కానీ.. మరీ ఇంత ఓపెనా అనేశారు. 


ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్ కు కంగనా రనౌత్ హాజరైంది. ఆమె వేసుకున్న డ్రస్ చూసి అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. ఆమె డ్రస్సింగ్ చూసి ఎబ్బెట్టుగా ఫీలయ్యారు. వీరాభిమానులు కూడా ఆమె వస్త్రధారణ చూసి తిట్టుకున్నారు. కంగనా తన తీరు మార్చుకోవాలని, లేకుంటే అభాసుపాలు కాక తప్పదని ఆమె సన్నిహితులు కామెంట్ చేస్తున్నారు. కంగనా ఫ్యాషన్ రోజు రోజుకు శృతి మించుతోందంటున్నారు. అందగా కనపడాలనే తాపత్రయంతో.. చివరకు అభాసుపాలవుతోందని విమర్శిస్తున్నారు. 


సెలబ్రిటీ అంటే.. తళుకు బెళుకు డ్రస్సులతో అందరినీ ఆకట్టుకోవాలి. అందరి దృష్టిలో పడాలని వారికి ఉంటుంది. కానీ అందుకోసం మరీ దారుణమైన డ్రస్ లలో కనబడితే పబ్లిక్ పరేషాన్ అవుతారు. ముఖ్యంగా హీరోయిన్ల కోసమే కాసుకు కూర్చునే కెమెరాలు, రిపోర్టర్లు ఊరుకుంటారా.. పెద్ద పెద్ద ఫోటోలు ప్రచురించి, ఆసక్తిర కథనాలు రాసేస్తారు. ఈ మధ్య కాలంలో ఇదో రకం పబ్లిసిటీ స్టంట్ గా మారింది. కంగనా కూడా ఇదే కోరుకుంటుందేమో. 


మరింత సమాచారం తెలుసుకోండి: