ప్రస్తుతం హీరోయిన్స్ లో ఫాంలో ఉన్నదు ఎవరంటే ఒకటి రకుల్ ప్రీత్ సింగ్ అయితే మరొకరు రెజినా.. ఇద్దరు భామలు దాదాపు ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేశారు అయితే రకుల్ ఏమో తన టాలెంట్ తో స్టార్స్ తో సినిమాలు చేసేస్తుంటే రెజినా మాత్రం కుర్ర హీరోలతో సరిపెట్టుకుంటుంది. రీసెంట్ గా జ్యో అచ్యుతానంద సినిమాతో హిట్ అందుకున్న రెజినా సినిమాలో మంచి అభినయంతో అలరించింది.


సినిమా మొదటి నుండి నమ్మకం ఉంచిన రెజినా సక్సెస్ ను కూడా అదే రేంజ్లో ఎంజాయ్ చేస్తుంది. అయితే ఆ సినిమాలో హీరోలు నారా రోహిత్, నాగ శౌర్య మాత్రం రెజినా అంటే బాబోయ్ అనేస్తున్నారు. రీల్ లైఫ్ లో రెజినా వర్క్ అవుట్ అవుతుందేమో కాని రియల్ లైఫ్ లో రెజినాను భరించడం కష్టమే తను చాలా ఇంటెలిజెంట్ అనేశాడు నాగ శౌర్య. ఇక శౌర్య చెప్పిన మాటకు నారా రోహిత్ కూడా వంత పాడాడు.


ముగ్గురు కలిసి చేసిన ఈ సినిమా మంచి సినిమాగా నిలవడంతో చిత్రయూనిట్ అంతా సంతోషంగా ఉన్నారు. అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అన్నదమ్ముల మధ్య అనుబంధంతో ప్రేక్షకుల మదిని టచ్ చేయడం జరిగింది. రోహిత్, నాగ శౌర్య ఇద్దరు తమ క్యారక్టర్స్ కు హడ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అందించారు. సినిమా సక్సెస్ లో ముఖ్యంగా ఈ ముగ్గురే కారణమవడం విశేషం.


సో మొత్తానికి నటుడిగా మంచి ఫాం కొనసాగిస్తూనే దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ మనసుకి తాకే సినిమాలతో అలరిస్తున్నాడు. ఇక తన తర్వాత సినిమా నానిని హీరోగా పెట్టి చేస్తున్నాడట. త్వరలో ఆ సినిమా ఎనౌన్స్ మెంట్ కూడా రాబోతుందట. ఇక దర్శకుడిగా బిజీ అయితే నటుడిగా అవసరాల శ్రీనివాస్ నటుడిగా కొంత గ్యాప్ తీసుకునే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: