అక్కినేని కుటుంబంలో హీరోలు వరుస సినిమాలతో బిజిగా ఉన్నారు. అలాగే గత కొంత కాలంగా వీరి కుటుంబంలో నాగ చైతన్య, అఖిల్ పెళ్ళిళ్ళకి సంబంధించిన న్యూస్ సైతం హల్ చల్ చేస్తుంది. అయితే అఖిల్ పెళ్లికి రూట్ క్లియర్ కాగా.... నాగ చైతన్య పెళ్ళిపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అక్కినేని నాగచైతన్య, సమంతా జంట వెండితెరపై హిట్ పెయిర్ అన్న సంగతి తెలిసిందే.

వీరు రియల్ లైఫ్ లోనూ ఒకటికానున్నారని న్యూస్ అంతటా వినిపిస్తుంది. అయితే వీరు పెళ్లికి ముందే ఒకటి కానున్నారనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...త్వరలోనే ఈ జంట కలసి ఒక సినిమాలో చేయనున్నారు. అర్జున్ కపూర్,అలియా భట్ జంటగా చేసిన '2 స్టేట్స్' మంచి హిట్ ని అందుకుంది.

ఇప్పుడు ఆ మూవీని తెలుగులో రిమేక్ చేయనున్నారు. వెంకట్ కుంచెం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని రెడీ చేస్తుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన స్టార్ కాస్టింగ్ ని పరిశీలించిన చిత్ర యూనిట్...నాగచైతన్య, సమంతా పర్ఫెక్ట్ గా సరిపోతారని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన ప్రపోజల్ ఇప్పటికే నాగ చైతన్య, సమంతాలకి చెప్పినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే వీరిద్దరూ ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే వీరిద్దరూ పెళ్లికి ముందే ఈ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం. త్వరలోనే దీనిపై అఫిషియల్ న్యూస్ రానుందని అంటున్నారు. అందుకే ఇండస్ట్రీలో సమంత, నాగచైతన్యలు పెళ్లికి ముందే ఓ సారి కలవనున్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగచైతన్య తన అప్ కమింగ్ మూవీ ప్రేమమ్ సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అలాగే సమంత సైతం కమిట్ అయిన చిత్రాలకి సంబంధించిన షూటింగ్ లో ఫుల్ బిజిగా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: