హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తు కాని ఆ అవకాశాన్ని తమ కెరియర్ కు సహకరించేలా క్రేజ్ తెచ్చుకోవడం గొప్ప విషయం. ఎప్పుడో రొమాన్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఓ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మరి ఆ అవకాశాన్ని అమ్మడు ఎలా వాడుకోనుందో చూడాలి. ఇంతకీ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన లక్కీ గాళ్ ఎవరంటే మానస హిమవర్ష.


రొమాన్స్ సినిమాలో ప్రిన్స్ తో రొమాన్స్ చేసి వారెవా అనిపించుకున్న మానస ఆ తర్వాత వేరే భాషల్లో సినిమాలు చేసింది. అయితే ప్రస్తుతం తెలుగులో ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడికి లక్కీగా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. డాలి డైరక్షన్లో పవర్ స్టార్ చేస్తున్న కాటమరాయుడా సినిమాలో మానస పవన్ కు మరదలిగా నటిస్తుంది.


ఓ విధంగా మనస లాంటి ఓ అప్ కమింగ్ హీరోయిన్ కు ఇదో గొప్ప ఆఫర్ అని చెప్పాలి. మరి ఈ అవకాశం అమ్మడు ఎలా వాడుకుంటుందో చూడాల్సి ఉంది. స్టార్ సినిమా అంటే కేవలం ఆ స్టార్ తో పాటుగా సినిమాలో ఉన్న అన్ని యాస్పెక్ట్స్ మీద ఆడియెన్స్ దృష్టి కేంద్రీకరిస్తారు. కాబట్టి మానస కూడా మెగా అభిమానులు పవర్ స్టార్ అభిమానుల అభిమానం పొందే అవకాశం ఉంది.


అంతేకాకుండా సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా మరో నలుగురు కుర్ర హీరోలను కూడా నటింపచేస్తున్నారట. కొద్దిపాటి గ్యాప్ తర్వాత స్టార్ట్ చేసిన కాటమరాయుడా షూటింగ్ పవన్ రాకతో స్పీడ్ అప్ అయ్యిందట. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంలో శరత్ మరార్ నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: