ప్రస్తుతం ఫిలింనగర్ లో చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి ఒక ఆ శక్తికర చర్చ జరుగుతోంది.  ‘ఖైదీ నెంబర్ 150’ కోలీవుడ్ మూవీ ‘కత్తి’ రీమేక్ గా రూపొందుతున్న నేపధ్యంలో ‘కత్తి’ సినిమాలోని అనేక సీన్స్ ను తెలుగు నేటీవిటీకి అనుగుణంగా చాల మార్పులు చేర్పులు చేసారు.  ముఖ్యంగా ఈసినిమాకు స్క్రిప్ట్ ను అందించిన పరుచూరి బ్రదర్స్ కు మరో ముగ్గురు రచయితలు ఘోష్టు రైటర్స్ గా పనిచేసారు అంటే ‘ఖైదీ నెంబర్ 150’ స్క్రిప్ట్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో అర్ధం అవుతుంది.

ఈసినిమా మూల కథ రైతుల సమస్యలు చుట్టూ తిరిగిన నేపధ్యంలో మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఎదుర్కుంటున్న వర్తమాన సమస్యల పై చాల పవర్ ఫుల్ డైలాగ్స్ చిరంజీవి నోటివెంట రాబోతున్నాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ వార్తలు ఇలా ఉండగా ‘కత్తి’ సినిమాలో విజయ్ నటించిన ఒక సీన్ ను యధాతధంగా తెలుగు వర్షన్ ‘ఖైదీ నెంబర్ 150’ లో పెట్టాలా వద్దా అన్న విషయం పై వినాయక్ చిరంజీవిలు చాల లోతుగా ఆలోచిస్తున్నట్లు టాక్.

ఇక వివరాలలోకి వెళితే ‘కత్తి’ తమిళ వెర్షన్ లో హీరో విజయ్ ఒక సీన్లో అండర్ వేర్ తో నటించాడు. పోలీస్ స్టేషన్ లాకప్ లో ఆ  సీన్ ఉంటుంది. ఒక స్టార్ హీరో అండర్ వేర్లో కనిపించడం తమిళనాడులో సంచలనం సృష్టించింది.  కోలీవుడ్ హీరో విజయ్ సహజత్వం కోసం అలా నటించి అందరి ప్రశంసలు పొందాడు. 

ఇప్పుడు ఆసీన్ యధాతధంగా చిరంజీవి 150వ సినిమాలో పెట్టాలా ? వద్దా ? అనే విషయమై దర్శకుడు వినాయక్ ఎటూ తేల్చుకోలేక ఆలోచిస్తున్నాడని టాక్.  అదీకాకుండా లక్షలాది మంది అభిమానులు కలిగిన చిరంజీవి అటువంటి సీన్ లో సహజత్వం కోసం నటిస్తే మెగా అభిమానులు ఒప్పుకుంటారా అన్న అనుమానం అటు వినాయక్ కి ఇటు మెగా కాంపౌండ్ కు ఉన్నట్లు టాక్.

దీనితో ఈ విషయమై ప్రస్తుతం ఎటూ తేల్చుకోలేక సినిమా నిర్మాణం అంతా పూర్తి అయిన తరువాత చివరి నిముషంలో ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకుందామని వినాయక్ చిరంజీవిలు ప్రస్తుతానికి ఈ అంశాన్ని పక్కకు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే పాత్ర డిమాండ్ చేసినప్పుడు ఎటువంటి సాహసమైనా చేస్తూ నటించే తెగువ కోలీవుడ్ హీరోలలో చాల ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటి విషయాలలో మన టాలీవుడ్ హీరోలు చాల మొహమాట పడతారు అయితే చిరంజీవి ఇటువంటి సాహసం చేసి మరో కొత్త సంచలనానికి తెర తీస్తాడా ? లేదా అన్నది ఈ సినిమా విడుదల అయితేకాని తెలియదు అని అంటున్నారు.  ముఖ్యంగా ఈసినిమాలో చిరంజీవి ఆవేశంగా చెప్పే పంచ్ డైలాగ్స్ కు చిరంజీవి స్టెప్స్ కు ప్రాధాన్యత ఇస్తున్న నేపధ్యంలో బహుశా ఈ సీన్ ఉండకపోవచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: