టాలీవుడ్ దర్శకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అని చెప్పాలి.. అయితే వీరందరిలో బోయపాటిది మాత్రం సెపరేట్ స్టైల్.. తన సినిమాలో హీరోల వీరరసం అభిమానులు పండుగ చేసుకునేలా ఉంటుంది. ఈ ఇయర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సరైనోడు అంటూ సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా తీస్తున్నాడు.


ఇక యువ హీరోగా నిర్మాత కొడుకుగా తీసిన రెండు సినిమాలను అంతగా ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయలేని శ్రీనివాస్ బోయపాటి శ్రీను చేతిలో పడితే సినిమా హిట్ గ్యారెంటీ అనుకున్నాడు అందుకే అతనితో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా మాత్రం రెగ్యులర్ బోయపాటి స్టైల్ లో ఉండదట. వయిలెన్స్ ఎక్కువగా ఉండే బోయపాటి సినిమాలు ఫ్యామిలీ ఆడియెన్స్ కాస్త చూసేందుకు ఇష్టపడరు.


ఎమోషన్స్ ను సినిమాల్లో ఉండేలా జాగ్రత్త పడే బోయపాటి ఈసారి తనలోని సరికొత్త టాలెంట్ ను ఎక్స్ పోజ్ చేయనున్నాడట. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ తో కాబట్టి ఆ ప్రయోగం చేస్తున్నాడు ఎందుకంటే సినిమా కాస్త అటు ఇటైనా పెద్ద ఎఫెక్ట్ ఉండదు కాని పెద్ద హీరో అయితే కచ్చితంగా రిస్క్ లో పడాల్సి వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నాడట.  


ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్న బోయపాటి సినిమాకు సంబందించిన కథను కూడా సిద్ధం చేశాడని తెలుస్తుంది. మరి తీస్తున్న సినిమా హిట్ అయితేనే గాని మెగా మూవీ ఆఫర్ వచ్చే అవకాశం ఉండదు. సో మొత్తానికి బోయపాటి తనలోని కొత్త యాంగిల్ ట్రై చేయడానికి కాస్త ఉత్సాహంగానే ఉన్నాడు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: