ఏదైనా ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో మూవీలను చేయాలని ప్రతి నిర్మాతకి ఉంటుంది. ముఖ్యంగా పెద్ద నిర్మాతల మధ్య ఈ పోటీ ఉంటుంది. అయితే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోతో....మరో ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్ సినిమాలను నిర్మించాలనేది చాలా తక్కువ మంది హీరోల విషయంలో జరుగుతుంది. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెలకొంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం మహేశ్ బాబు తన అప్ కమింగ్ మూవీ మురుగదాస్ కాంబినేషన్ లో బిజిగా ఉన్నాడు.


ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ అనంతరం మహేష్ బాబు కొరటాల శివతో చేయనున్నాడని అంటున్నారు. అలాగే తమిళ ఇండస్ట్రీకి నుండి ప్రముఖ ప్రొడ్యూసర్ కళైపులి థాను సైతం మహేష్ తో మూవీ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అట్లీ కుమార్ దగ్గర సహాయ దర్శకుడిగా చేసిన బాస్కో, మహేష్ మూవీకి డైరెక్ట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.


కళైపులి థాను ఇప్పటికే బాస్కో వద్ద నుండి ఓ కథని కోరాడని...మహేష్ బాబు సినిమా ఎక్కువుగా తమిళనాడు లొకేషన్స్ లో జరుగుతుండటంతో....కథని సైతం అక్కడే చెప్పే విధంగా కళైపులి థాను ప్లాన్ చేసుకున్నాడు. ఒకవేళ ఈ కథ ఓకె అయితే కళైపులి థాను, మహేష్ బాబు మూవీని భారీ ఎత్తున నిర్మించే అవకాశం ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో మహేష్ బాబుతో కళైపులి థాను రెగ్యులర్ టచ్ లో ఉంటున్నారు.


అయితే ఇప్పటకే కళైపులి థానుకి మహేస్ కి కథని వినిపించాడంటూ వచ్చే టాక్స్ లో ఏ మాత్రం నిజం లేదని అంటున్నారు. మరికొద్ది రోజుల్లే తను కథని వినిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. కొంత మంది అయితే దాదాపు కళైపులి థాను మూవీకి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్ఛే ఛాన్స్ ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: