జూనియర్ ను టాలీవుడ్ హీరోల రేస్ లో టాప్ 3 స్థానంలోకి తీసుకు వెళ్ళిపోయిన ‘జనతా గ్యారేజ్’ సక్సెస్‌ తో జూనియర్ ఖుషీగా ఉన్నాడు అని అందరూ భావిస్తూ ఉంటే ఈ సినిమా సూపర్ సక్సస్ అయి కలక్షన్స్ వర్షం కురిపిస్తూ ఉన్నా ఆ కలక్షన్స్ వ్యవహారమే జూనియర్ కు కోపం తెప్పిస్తున్నట్లు టాక్.  ఈ సినిమా కలక్షన్స్ విషయంలో కొంత క్లారిటీ లేదని జూనియర్ భావన అని అంటున్నారు. 

జూనియర్ కు తన సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం మేరకు ‘జనతా గ్యారేజ్’ కి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చాయని అయితే ఆ విషయాన్ని ఎవ్వరూ బయటకు చెప్పడం లేదు అన్న విషయాలు జూనియర్ దృష్టికి కొంతమంది తీసుకు వచ్చినట్లు ఫిలింనగర్ లో వార్తల హడావిడి వినిపిస్తోంది.  
ఇప్పటికి  ఈ సినిమా 80 కోట్ల నెట్ కలక్షన్స్ ను వసూలు చేసింది అని నిర్మాతలు చెపుతూ ఉన్నా 135 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చాయి అని వార్తలు వస్తున్న నేపధ్యంలో తన మూవీకి సంబంధించిన కలెక్షన్ల వివరాలు పూర్తిగ బయటకు రావట్లేదని జూనియర్ అసంతృప్తితో ఉన్నాడని టాక్. 

అయితే ఈ వార్తలలో ఎన్ని వాస్తవాలు ఉన్నాయన్నది తెలియకపోయినా 135 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చిన సినిమా గురించి ఈసినిమా నిర్మాతలు ఎందుకు మౌనంగా ఉన్నారు అన్న విషయమై సమాధానం లేని ప్రశ్నగా ఉందని టాలీవుడ్ విశ్లేషకులు కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా జూనియర్ తన తదుపరి సినిమా విషయమై ఇంకా అదే అయోమయాన్ని కొనసాగిస్తున్నట్లు టాక్.

‘జనతా గ్యారేజ్’ ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చిన జూనియర్ ఆ తరువాత పూర్తిగా మౌనం వహించి ప్రస్తుతం ఎవ్వరికీ పెద్దగా అందుబాటులో ఉండటం లేదని టాక్.  దీనికితోడు జూనియర్ అనీల్ రావిపూడి చెప్పిన కథకు ఓకె చెప్పినా యంగ్ డైరెక్టర్ తో అంత సాహసం వద్దని జూనియర్ సన్నిహితులు కొంతమంది సలహాలు ఇవ్వడంతో అనీల్ రావిపూడి విషయాన్ని పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

మరొక వైపు పూరి జూనియర్ కోసం ఒక కథను తయారు చేసినా ఆ కథకు కూడ పూర్తిగా ధైర్యం చేసి ఓకే చెప్పలేని పరిస్థితి జూనియర్ ది అని అంటున్నారు.  ‘జనతా గ్యారేజ్’ సూపర్ సక్సస్ తరువాత కొరటాల శివ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ విషయంలో పరుగులు తీస్తూ ఉంటే జూనియర్ మాత్రం తన నెక్స్ట్ మూవీ విషయంలో ఎటూ తేల్చుకోలేక విలువైన సమయాన్ని వృథ చేసుకుంటున్నాడు అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

జూనియర్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం మేరకు తారక్ రానున్న దసరా రోజులలో తన తదుపరి సినిమా విషయమై ఒక స్పష్టమైన క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది అంటూ వార్తలు వినపడుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: