టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ప్రభాస్. దాదాపు 3 సంవత్సరాల సమయాన్ని పూర్తిగా బాహుబలి వెర్షన్ కే కేటాయించిన హీరో ప్రభాస్. 3 సినిమాలను చేయాల్సిన సమయాన్ని కేవలం ఒకే ఒక్క సినిమా కోసం కేటయించటం అనేది..ప్రభాస్ కి మాత్రమే సాధ్యం అయిందని అంటున్నారు. ఇలాంటి హీరో దొరకటం నిజంగా బాహుబలి వంటి కథే కారణం అని రాజమౌళి సైతం పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.


ఇదిలా ఉంటే రాజమౌళి 'బాహుబలి 2' మూవీకి సంబంధించిన షూటింగ్ ని వేగవంతంగా పూర్తి చేస్తున్నాడు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కి సైతం శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. బాహుబలి కంటే సీక్వెల్ అయిన  'బాహుబలి 2' భారీతనంతో రూపుదిద్దుకుంటోంది. రీసెంట్ గా 'బాహుబలి 2'  కి సంబంధించిన కీలక యుద్ధ సన్నివేశాలతో పాటు ఒక పాటను చిత్రీకరించారు.


చిత్ర యూనిట్ పెట్టుకున్న టార్గెట్ ప్రకారం నవంబరు నాటికి ఈ సినిమా షూటింగును పూర్తిచేయాలనేది రాజమౌళి నిర్ణయం. ఇదిలా ఉంటే 'బాహుబలి 2' కి సంబంధించిన థియోట్రికల్ ట్రైలర్ ఎలా ఉండనుందో చూడాలనేది ప్రేక్షకుల కోరిక. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన ఒకటి రానుందని అంటున్నారు. అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు ఉండటంతో....అదే రోజు థియోట్రికల్ ట్రైలర్ రానుందని అంటన్నారు.


అయితే చిత్ర యూనిట్ నుండి వినిపిస్తున్న క్లియర్ టాక్స్ ప్రకారం...అక్టోబర్ 23న ప్రభాస్ కి సంబంధించిన 30 సెకండ్ల టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. 'బాహుబలి 2' మూవీకి సంబంధించిన ప్రి ప్రమోషన్స్ సైతం ప్రభాస్ పుట్టినరోజు వేదికగా రాజమౌళి ముహుర్తం పెట్టుకున్నారు. ప్రభాస్ పుట్టినరోజున 'బాహుబలి 2' ప్రభాస్ టీజర్ రావటం అనేది...ప్రభాస్ కి ఇది రాజమౌళి ఇస్తున్న భారీ గిప్ట్ అని అంటున్నారు అభిమానులు.



మరింత సమాచారం తెలుసుకోండి: