ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంటర్నేషనల్ మార్కెట్ ని కలిగి ఉన్న హీరో ఎవరు అంటే, అది కచ్ఛితంగా హీరో ప్రభాస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే బాహుబలి వంటి భారీ విజయం తరువాత ప్రభాస్ పేరు ఇండియన్ మార్కెట్ లోనే కాకుండా హాలీవుడ్ మార్కెట్ లోనూ ఫేమస్ అయింది. అందుకే ప్రభాస్ నటించే తదుపరి సినిమాలకి ఇది ప్లస్ గా మారనుంది. ఇదిలా ఉంటే...'బాహుబలి 2' సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు వచ్చింది.


ఈ మూవీ అనంతరం ప్రభాస్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్ చిత్రంలో నటించనున్నాడు. దర్శకుడు సుజీత్ తో కలిసి ప్రభాస్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి బడ్జెట్ పై ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాను మొదట 60 కోట్ల రూపాయలతో నిర్మించాలని చూసింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు.


అయితే బాహుబలి2 తరవాత ప్రభాస్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి...ఆ బడ్జెట్ ని 100 కోట్లు చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారంట. ప్రభాస్ తో ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్ మూవీకి 100 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే...దానికి బిజినెస్ జరిగే అవకాశం ఉందా? అనే డౌట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.


ఇక ఇండస్ట్రీకి చెందిన పలువురు బడా నిర్మాతలు ఇదే విషయంపై వారి అభిప్రాయాన్ని చెబుతూ..ప్రభాస్ మూవీకి 100 కోట్ల రూపాయల బడ్జెట్ అనవసరం అని అంటున్నారు. రెగ్యులర్ ఫార్మెట్ కమర్షియల్ చిత్రాల మార్కెట్ బడ్జెట్ కేవలం 60 కోట్ల రూపాయలే అని అంటున్నారు. ఇక కథ విషయంలో భిన్నంగా ఉంటూనే అంతకు మించి బడ్జెట్ ని పెట్టాలనేది పెద్ద నిర్మాతల సూచనగా తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: