తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. తండ్రికి తగ్గ తనయుడిగా విభిన్నమైన పాత్రలు పోషించిన బాలకృష్ణ టాప్ హీరోగా నిలిచారు. ఇక నందమూరి హరికృష్ణ తనయులు కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ లు కూడా సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే ఎన్టీఆర్ అచ్చం సీనియర్ ఎన్టీఆర్ ముఖ కవలికలు ఉండటంతో మంచి క్రేజ్ వచ్చింది. బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా నిన్ను చూశాక చిత్రం తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో '' స్టూడెంట్ నెంబర్ 1 '' నటించాడు.  అయితే ఇండస్ట్రీలోకి వచ్చాక రాజమౌళి మొదటి చిత్రం ఇదే కావడం ఎన్టీఆర్ కి కూడా ఇదే చిత్రంతో మంచి స్టార్ ఇమేజ్ రావడం జరిగింది.
Image result for student no. 1 posters
2001 లో  ఇదే రోజున అంటే సెప్టెంబర్ 27 న స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ మనవడిగా తెలుగు తెరకు పరిచయమైన ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ తో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు . ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది . ఏకంగా 73 కేంద్రాల్లో 50 రోజులు ,42 కేంద్రాల్లో 100 రోజులను పూర్తిచేసుకొని ఎన్టీఆర్ కు రాజమౌళి కి అజరామరమైన విజయాన్ని అందించింది.
Image result for simhadri
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి హీరో ఎన్టీఆర్ తో పడ్డ కష్టాలకు లోలోపల విపరీతంగా తిట్టుకునేవాడట.  స్టూడెంట్ నెం 1 చిత్రం సమయంలో ఓ పాట చిత్రీకరణ గురించి  స్విట్జర్లాండ్ కు వెళ్లగా అక్కడ రాజమౌళికి, ఎన్టీఆర్ కి ఒకే గది అప్పజెప్పడం జరిగిందట..ఇక రాజమౌళి 9 గంటల వరుకు నిద్రిస్తే..ఎన్టీఆర్ మాత్రం 12 గంటల వరకు టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూస్తూ సౌండ్ పెట్టి మనోడిని తెగ ఇబ్బంది పెట్టేవాడట.
Image result
దాంతో బయటకు ఏమి అనలేక లోలోన బాగానే తిట్టుకునే వాడట ఈ విషయాన్ని ' స్టూడెంట్ నెంబర్ 1 ''  చిత్రం 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్ చేశాడు. అయితే ఈ చిత్రం తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్ మంచి స్నేహితులు కావడం తర్వాత సింహాద్రి, యమదొంగ లాంటి బ్లాక్ బ్లస్టర్స్ ఇవ్వడం జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: