తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు సినిమాలంటే ఓ హీరో,విలన్,హీరోయిన్,కొద్ది మంది కమెడియన్లు వీరితో సాగేది. విలన్ హీరో కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం..హీరోయిన్ ప్రేమించడం మద్య లో కామెడీ సీన్లు విలన్ ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ ని రేప్ చేయాలని చూడటం హీరో వచ్చి కాపాడటం విలన్ చంపడమో..జైల్ కి పంపించడమో ఇలా సినిమాలు వస్తున్న నేపథ్యంలో వాస్తవికతకు దగ్గరగా సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ ‘శివ’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం తర్వాత గ్యాంగ్ స్టర్ సినిమాలు చాలా వచ్చాయి. ఇక వర్మ శిశ్యుడు పూరీ జగన్నాధ్ కొంత కాలం అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి పవన్ కళ్యాన్ తో ‘బద్రి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి వరకు సరైన హిట్ కోసం చూస్తున్న పవన్ కి ఓ మంచి సినిమా అందించాడు.
Image result for IJAM MOVIE
ఈ చిత్రం తర్వాత ఇడియట్, పోకిరి, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, దేశముదురు లాంటి వరుస హిట్స్ తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.  డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. మధ్యలో కొన్ని ప్లాపులు పలకరించిన పూరీలోని కసి,పట్టుదల మాత్రం అలానే కొనసాగుతూ వస్తోంది.  ప్రస్తుతం నందమూరి కళ్యాన్ రామ్ తో  ఇజం అనే మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఓ టీజర్ విడుదల చేశాడు. పూరీ తన మాస్ ఎలిమెంట్స్ మొత్తం అందులో చూపించినట్లు కనిపిస్తుంది..అంతే కాదు కళ్యాన్ రామ్ ఇప్పటి వరక సిక్స్ ప్యాక్ తో ఎప్పుడూ కనిపించలేదు..ఇజం సినిమాల్ సిక్స్ ప్యాక్ తో దర్శనమిస్తున్నాడు.
Image result for IJAM MOVIE
 సాధారణంగా పూరీ తన సినిమాలలో ఈ హీరోల లుక్ లు పూర్తిగా మార్చేసాడు.   ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమా పూరీ స్టైల్లో ఓ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్ గా కనిపించనున్నారు. అదితి ఆర్య కథానాయికగా నటిస్తోంది. జగపతి బాబు కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు పూరీ జగన్నాధ్ పుట్టినరోజు సందర్భంగా ఏపీహెరాల్డ్.కామ్ శుభాకాంక్షలు తెలుపుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: