Image result for lata mangeshkar with vajpayee

భారత జాతి సాంస్కృతిక  భావ బందాలకే కాదు భవ బంధాలకుకూడా  ప్రతీక లత గానం. లత ఒక మధుర గాయని. కష్టాల్లోనూ, కడగండ్లలోనూ, సుఖాల్లోనూ హర్షాల్లోనూ ఒంటరితనలోనూ, సమూహములోనూ, వెన్నెల్లోననా, చీకటిలోనూ, మనోల్లాసములోనూ మనొ విలాపంలోను  మన లతామంగేష్కర్ గానసుధామృతం మన మస్తిష్కములో ఉంటే చాలు హృదయములో వెనవేలు వీణలు మ్రోగుతాయి. మనసు భావపరంపరలతో స్పందిస్తుంది సమయానికి తగినట్లు. సమయానికి తగు పాటలు అంతరంగంలో ప్రతిద్వనిస్తాయి.

Image result for lata mangeshkar with her co singers

సెప్టెంబర్ 28, 1929 లో పుట్టి (నేడు ఆమె 87 వ పుట్టినరోజు)  1942 లో (ఏడున్నర దశాబ్డాదాల గానసుధా రసామృతాన్ని మనపై ముంచెత్తింది వరద గంగోత్రిలా) ఈ గాన ప్రవాహం జానావళి వీనులకు విందు చేయటం ప్రారంభమవటానికి "ఒక పుష్కర కాలం" పట్టింది.

Image result for lata mangeshkar with Indira gandhi

గంగ హరిద్వార్లో మైదానంలో ప్రవేసించినట్లు లత ముంబాయిలో ప్రవేశించింది 1942 నాటికి. పద్మ భూషణ్ (1969) పద్మవిభూషణ్ (1999) భారతరత్న (2001) లాంటి ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలతో సన్మానాలు ప్రేమతో ఆమె గళ-సీమ నలంకరించి దేశం తనని తాను గౌరవించుకోవటమే కాదు, మన గాన సుధామృతాన్ని విశ్వానికి వినమ్రం గా సమర్పించుకుంది.

Image result for lata mangeshkar with her co singers 

నేడు ఆమె సకల మానవాళి స్వంత గళం. విశ్వజనీనమైన వాగ్దేవి ప్రతిరూపం. 1989 లో భారతదేశపు అత్యున్నత చిత్రరంగ పురస్కారం దాదాఫాల్కే-అవార్ద్ తో ప్రభుత్వం ఆమెను సన్మానించి పండగ చేసుకుంది.

 Image result for lata mangeshkar with vajpayee

పువ్వు పుట్టగానే పరిమళించునన్నట్లు లత తన ఐదవ ఏటనే తండ్రి దీనానాథ్ మంగేష్కర్ గారి వద్ద మరాఠీ నృత్య సంగీత నాటకాల్లో నటించి గానం చేస్తూ తనతల్లి సుధామతి సం-రక్షణలో పెరిగింది. లత సోదరీ సోదరులే మీన, ఆషా, ఉషా మరియు హృదయనాధులు. ఆషాయే మనకు తెలిసిన మరో సుమధుర గాయని ఆషా భౌన్ష్లె. తన పదమూడవయేట తండ్రి మరణంతో కుటుంబ భాద్యతలు తనభుజస్కందాలపై వేసుకొని, కుటుంబసభ్యులను సుధూర తీరం చేర్చింది లత. తాను మాత్రం మిగిలింది అందరిలో ఒంటరిగా అయినా మనల్నందరిని సుమధురగాన వాహినిలో ముంచుతూ.

 Image result for lata mangeshkar with her co singers

మాస్టర్ వినాయక్ తనతొలి సంగీత గురువు మార్గదర్శి. 1945 నుండి "ఉస్థాద్ అమానత్ అలీ ఖాన్" ఆధ్వర్యములో  హిందుస్థాని శాస్త్రీయ సంగీతము నేర్చుకుంటూ  "ఆప్ కి సేవామే" (1946) లో తన తొలి సినిమా లో పాటలు పాడింది. బడీ మా అనే సినిమాలో తను అషా తో కలసి నటిస్తూ "మాతా తేరీ చరణో మే" అనే భాజన్ ను గానం చేసింది. 1947 భారత విభజన నేపధ్యము లో ఉస్థాద్ అమానత్ అలీ ఖాన్ పాకిస్థాన్ కు వలస పోవటముతో అమానత్ అలి ఖాన్ దేవస్వలే, రజాబ్ అలి ఖాన్, పండిట్ తులసిదాస్ శర్మ, గులాం హైదర్ లాంటి హేమా హెమీల శిక్షనలో ఆమే గాన కోకిలగా రూపు దిద్దుకుంది.

 Image result for lata mangeshkar images

శశిధర్ ముఖర్జీ కి గులాం హైదర్ లతను షాహీద్ (1948) సినిమా లో పాటలు పాడటానికి పరిచయం చేయగా ఆమె కంఠస్వరం మరీ బలహీనంగా ఉందని పాటలు పాడటానికి పనికి రాదని తిరస్కరించినప్పుడు అగ్రహానికి గురైన హైదర్ ముంబాయి చిత్రసీమ లోని దర్శక, నిర్మాతలు తమ సినిమాల్లో రేపొక నాటికి పాటలు పాడమని ఆమే బ్రతిమిలాడుతూ కరచరణాలను స్పర్శించే రోజువస్తుంది చెప్పాడు. అదే ఆమె లోని గాయనిని మేల్కొలిపి మహోగ్ర గంగోత్రే కాదు, ధీమ, మధుర, లాలిత్య గాన గంగోత్రిగా పరవళ్ళు తొక్కింది. 


తెరపై తన అధరాల నుండి  - లత అమృత గాన ప్రవాహాన్ని అందించిన మధుబాల

Image result for lata mangeshkar with madhubala

తన 84 వ జన్మదినోత్సవం రోజున గులాం హైదర్ తనకు గాడ్ ఫాదర్ అనీ తనలోని నైపుణ్యానికి, సామర్ధ్యానికి, ఆత్మవిశ్వాసానికి నమ్మకముంచి పదునుపెట్టి వన్నె తెచ్చారని మజ్బూర్ (1948) లో తనకు గాయని గా ఒక బ్రేక్ ఇచ్చారని ఆయన్ను స్మరిచుకున్నారు ఆర్ధ్ర నయనాలతో. ఆపాట "దిల్ మెర తోడా ముఝే కహీ క న చోరా" భారత జాతిని గాన ప్రవాహములో ముంచెత్తింది.

 Image result for lata mangeshkar with madhubala

చిత్ర సీమ లో తొలి దశలో ఉర్దూ అరబిక్ భాషా సాహిత్యాలే హిందీ చిత్ర రంగా సంగీతాన్ని సాహిత్యాన్ని శాసించాయి. లత మహారాష్ట్రియన్ యాక్సెంట్ (యాస) ఈ పద ప్రయోగాలకు సరిపోదని ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ఆమేను నిరుత్శాహ పరిచాడట. కాని షఫి అనే ట్యూటర్ వద్ద అతి తక్కువ సమయములోనే ఉర్దూ, అరబిక్, హిందీ భాషలపై పట్టుసాధించింది లత. 1949 లో మహల్ సినిమా కోసం "ఆయేగా ఆనేవాలా" అనే పాటలో మధుబాల తెరపై పెదవులు కలిపింది. అదే పాట లతను నింగికెగరేసింది.

 Image result for lata mangeshkar with her co singers

ఆ తరవాత అనీల్ బిస్వాస్, శంకర్ - జైకిషన్, ఎస్.డి బర్మన్, నౌషాద్ అలి, ఇలా వందల్లో సంగీత దర్శకులతో 30000 కు పైగా పాటలు పాడి గిన్నెస్ బుక్ లో స్థానం సాధించారు. ఈ విషయములో ఆమెకు మహమ్మద్ రఫీ గారికి మద్య కాంట్రావర్సి వుందంటారు అదీ గిన్నెస్ బుక్ కు- వారిద్ధరికి మాత్రం కాదు.

 Image result for lata mangeshkar with her co singers

ఈ సంవత్సరం " నైటింగేల్ ఆఫ్ ఇండియా"  తన 87 జన్మదినం జరుపుకోవటం లేదు. ఆమె హృదయం కల్లోల సాగరమైంది పాకిస్తాన్, భారత్ జవాన్ లపై చేసిన హృదయవిధారక రాక్షస కృత్యానికి ఆమె చలించింది. ఈ విషయం వివరాలు తెలుసుకోవటానికి క్రింది లింక్ ను అనుసరించండి.

Image result for lata mangeshkar with Indira gandhi 

ఆ మహనీయురాలికి  “ఇండియా హెరాల్డ్”  “హృదయ పూర్వక జన్మదిన శుభాకంక్షల” ను ఈ వ్యాసం ద్వారా సమర్పించుకుంటుంది.

https://in.news.yahoo.com/lata-mangeshkar-special-message-pakistan-135004755.html

మధురగాయని లతా మంగేష్కర్ తన గాన సుధారసాన్ని మూడుపాటలతో తెలుగువారికి కూడా పంచింది.
సంతానం (1955) సినిమాలో "నిద్దురపోరా తమ్ముడా"  సంగీతం సుసర్ల దక్షిణామూర్తి , దొరికితే దొంగలు సినిమాలో
"శ్రీ వెంకటేశా..."  బాలమురళికృష్ణ, సుశీల గార్ల తో ఎస్.రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో,  ఆఖరి పోరాటం సినిమాలో "తెల్లచీరలో" అనే పాట ఇళయరాజా సంగీత దర్శకత్వములో.

 Image result for lata mangeshkar with her co singers

మరింత సమాచారం తెలుసుకోండి: