తెలుగు ఇండస్ట్రీలో నటసార్వభౌముడిగా ఒక్క వెలుగు వెలిగిపోయిన మహానటులు ఎన్టీఆర్ తెలుగు చిత్ర సీమకే వన్నె తెచ్చారు. ఆయన నటించని పాత్రలు అంటూ ఏవీ లేవు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, రావణాసురుడు, భీముడు, దుర్యోధనుడు, భీష్ముడు.. ఇలా చెప్పుకుంటూ పోతే పౌరాణిక పాత్రలే కాకుండా సాంఘిక చిత్రాల్లోనూ తన అపూర్వ నటనతో ప్రేక్షకులను మైమరపించారు. అసలు తెలుగు చిత్ర రంగానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు రెండు కళ్ల లాంటి వారు అనండంలో అతిశయోక్తి లేదు.  తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ఆయన పేరు మారు మోగుతూనే ఉంటుంది. ఇక ఎన్టీఆర్ వారసుడిగా వెండి తెరకు పరిచయం అయిన హీరో నందమూరి బాలకృష్ణ.

తండ్రికి తగ్గ తనయుడిగా పౌరాణిక,జానపద,సాంఘిక చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. గత కొంత కాలంగా ఫ్యాక్షన్ చిత్రాల్లో నటిస్తున్న బాలకృష్ణ అలాంటి సినిమాలకు ఆయనే కరెక్టర్ అనేలా పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టాడు. ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న బాలయ్య తన తండ్రి బాటలోనే రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం బాలకృష్ణ 100 వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’లాంటి గొప్ప హిస్టారికల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.

తాజాగా బాలయ్య విమాన ప్రయాణంలో ఉండగా ఎన్టీఆర్ ఎవర్ గ్రీన్ హిట్ "దానవీర శూరకర్ణ" చిత్రంలో దుర్యోధనుడి పాత్రలోని డైలాగ్ లను బాలయ్య అలవోకగా చెప్పి తన సత్తా చాటాడు. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు తన ట్యాబ్ లో ‘దానవీర శూరకర్ణ’ చిత్రం చూస్తుండగా ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ కూడా ఇదే విమానంలో ప్రయాణిస్తున్నాడని తెలుసుకొని ఇందులో డైలాగ్స్ చెప్పమని రిక్వెస్ట్ చేశారు.
Image result for daana veera soora karna
అంతే ఆ ట్యాబ్ ను బాలయ్య తన చేతిలోకి తీసుకుని మరీ.. దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న సీన్ ని చూపిస్తూ.. గుక్క తిప్పుకోకుండా చెప్పాడు. అంతే అక్కడ ఉన్న వారంత వావ్ గ్రేట్ అమేజింగ్ అంటూ చప్పట్లు కేరింతలు కొట్టారు.  బాలకృష్ణ పౌరాణిక చిత్రాల్లో డైలాగ్స్ అద్భుతంగా చెప్పగడు..ఇప్పుడు ప్రత్యేక్షంగా అందరికీ దిమ్మతిరిగేలా చూపించాడు..దటీజ్ బాలయ్య. 


మరింత సమాచారం తెలుసుకోండి: