మెగా స్టార్ చిరంజీవి నలుపు రంగును ఈ మధ్య బాగా ఇష్ట పడుతున్నాడా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇటువంటి షాకింగ్ సెటైర్లు చిరంజీవి పై పడటానికి ఒక ఆసక్తికర కారణం ఉంది.  ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాకు సంబంధించిన టీజర్ ను డార్క్ గానే రూపొం దించారు.  ఆ తరువాత లేటెస్ట్ గా విడుదలైన చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ప్రోమోను కూడ డార్క్ గా రూపోదించి విడుదల చేయడంతో చిరంజీవికి నలుపు రంగు పై జాతక రీత్యా నమ్మకాలు పెరిగాయా ? అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. 

నిన్న చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోమో విడుదలైన కొద్ది సేపటికే కొందరు విమర్శకులు చిరంజీవి ఇటువంటి షోను బుల్లితెర పై నిర్వహించడానికి అంగీకరించి తప్పు చేసాడా ? అంటూ కొందరు తమ సందేహాలు వ్యక్త పరుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.  చిరంజీవిని ఈ విషయమై టార్గెట్ చేస్తున్న విమర్శకుల అభిప్రాయం ప్రకారం చిరంజీవి బాడీ లాంగ్వేజ్ బుల్లితెర షోలకు పనికి రాదు అని విమర్శకుల వాదన.  

నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ద్వారా తన ఇమేజ్ ని పెంచు కుంటే చిరంజీవి ఈ షో ద్వారా తన ఇమేజ్ ని తగ్గించుకునే ఆస్కారం ఉందని కొందరు విమర్శకులు కొత్త చర్చలకు తెర తీస్తున్నారు.  దీనికి కారణం ఇటువంటి షోలకు హోష్ట్ గా వ్యవహరించే సెలెబ్రెటీలు అందరితో కలిసి పోతూ మరీ ముఖ్యంగా ఆప్యాయంగా పలకరిస్తూ ఆ షోలో పాల్గొంటున్న ప్రతి వ్యక్తికి దగ్గర అయ్యే విధంగా ఆ షోను నిర్వహించాలని అటువంటి సమర్ధత నాగార్జునతో పోల్చుకుంటే చిరంజీవికి చాల తక్కువ అని అంటున్నారు.

అదీకాకుండా బయట ఫిలిం ఫంక్షన్స్ లో అనేక సార్లు కనిపించిన చిరంజీవి పెద్దగ ఫ్లెక్సి బుల్ గా కనిపించడని బయట కూడ తాను ఒక మెగా స్టార్ అన్న భావం కనిపించేలా చిరంజీవి బాడీ లాంగ్వేజ్ ఉంటుందని అటువంటి బాడీ లాంగ్వేజ్ టివి షోలకు ఎట్టి పరిస్తుతులలోను సరిపోదు అంటూ కొందరు ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు.  అంతేకాదు నాగార్జున ఈ షోలో సక్సస్ కావడానికి గల ప్రధాన కారణం ఆ షోకి వచ్చిన వారందరినీ ఆత్మీయంగా నవ్వుతూ పలకరించడంతో పాటు వారి కష్టాలను వింటూ వారిలో ఒకడిగా కలిసి పోయిన నాగార్జున ఓర్పు ఒక ప్రధాన కారణం అని అంటున్నారు. 

అటువంటి ఓర్పు నేర్పు చిరంజీవికి స్వభావ సిద్ధంగా చాల తక్కువ అని అయితే ఈ షో సక్సస్ కోసం చిరంజీవి ఆ లక్షణాలను ప్రాక్టీస్ చేసి ప్రదర్శించినా అది సహజంగా వచ్చినట్లు అనిపించదని దీనితో చిరంజీవి హోష్ట్ చేసే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోను చూస్తున్న వారికి నెమ్మది నెమ్మదిగా ఆ షో పట్ల ఆసక్తి తగ్గి పోతుందని కొందరి విమర్శకుల అంచనా.  

ఈ అంచనాలలో ఎన్ని వాస్తవాలో ప్రస్తుతానికి తెలియక పోయినా డిసెంబర్ 12 నుండి ప్రారంభం అయ్యే చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలోని తొలి ఎపిసోడ్స్ మాత్రం చిరంజీవికి ఉన్న లక్షలాది మంది మెగా అభిమానుల క్రేజ్ రీత్యా ఈ షో తొలి రోజులలో రేటింగ్స్ విషయంలో మాత్రం నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రేటింగ్స్ ను దాటి పోతుంది అన్నది మాత్రం వాస్తవం.  అయితే దేశ వ్యాప్తంగా ఒక్క అమితాబ్ – నాగార్జునులు తప్ప చాలామంది టాప్ సెలెబ్రెటీలు ఫెయిల్ అయిన ఈ బుల్లితెర మెగా షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చిరంజీవి క్రేజ్ ను పెంచడానికి ఎంత వరకు సహకరిస్తుందో అన్న విషయం ప్రస్తుతానికి సస్పెన్స్..    


మరింత సమాచారం తెలుసుకోండి: