సౌత్ ఇండియన్ సూపర్ బ్యూటీ కాజల్ ఓ బాలీవుడ్ హీరో చేతిలో అడ్డంగా మోసపోయిందట.. ఇది ఎవరో చెప్పింది కాదు స్వయంగా అమ్మడే ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిన కాజల్ బీ టౌన్ లో కూడా ఆ ఫాం కొనసాగించాలని అక్కడ ప్రయత్నాలు చేసింది కాజల్ అయితే ఒకటి రెండు ఆఫర్లు తప్ప పెద్దగా ఏమి రాలేదు.


అయితే షాహిద్ తో ఓ సినిమా అవకాశం రావడంతో ఎగిరిగంతేసిన కాజల్ ఆ టైంలోనే షాహిద్ కు బాగా దగ్గరయ్యిందట. దురదృష్టవ శాత్తు ఆ సినిమా ఆగిపోయిందట. సినిమా ప్రొడక్షన్ టైంలో తన లక్సరియస్ కార్లో షాహిద్ తనతో బాగా చనువుగా ఉన్నాడని సినిమా ఆగిపోయే సరికి సడెన్ గా తనతో మాట్లాడటం ఆపేశాడని కనీసం ఫోన్ కూడా చేయలేదని కాజల్ అన్నది.    


మరి అమ్మడికి సినిమా కల్చర్ తెలియదన్నట్టే మాట్లాడుతుంది. సినిమా చేస్తున్ననత సేపు సినిమాలో నటిస్తున్న హీరో హీరోయిన్ చెట్టాపట్టాలేసుకు తిరగడం బాలీవుడ్లో కామనే కాజల్ కు అది కొత్త కాబట్టి షాహిద్ మోసం చేశాడని ఫీల్ అవుతుంది. ఏది ఏమైనా అలా సడెన్ గా కాకుండా కాజల్ తో తన రిలేషన్ కు ఓ చిన్న పార్టీతో బై చెప్పేస్తే షాహిద్ కు ఈ అపవాదం కూడా ఉండేది కాదు.


షాహిద్ మీద మనసు పారేసుకున్న కాజల్ అతను మోసం చేయడంతో మళ్లీ సౌత్ సినిమాలకే అంకితమయ్యింది. ఇక కొద్దికాలంగా ఫేడవుట్ అవడానికి దగ్గర పడినట్టు కనిపించినా మళ్లీ తన క్రేజ్ తో వరుస క్రేజీ అవకాశాలను దక్కించుకుంటుంది ఈ అమ్మడు. మరి చూస్తుంటే కాజల్ హవా మరో ఐదేళ్ల దాకా ఇలానే కొనసాగేలా కనిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: