పవన్ కళ్యాణ్ రాజకీయాల నుండి తన మనసు మార్చుకుని నెమ్మదిగా తను మార్చుకున్న లుక్ తో ప్రస్తుతం కాటమరాయుడు మూవీ షూటింగ్ లో బిజీగా ఉంటే జ్యోతి అన్న ఒక అమ్మాయి పవన్ కళ్యాణ్ ను పెళ్ళి చేసుకుంటాను అంటూ పవన్ ఇంటి ముందు ధర్నా చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు ఈరోజు సోషల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. గత 4 నెలలుగా ఈమె పవన్ ను కలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే పవన్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డు పడుతూ ఉండటంతో ఈ జ్యోతి పవన్ ను కలవ లేకపోతోంది అని టాక్.

తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని అంటూ చెప్పడమే కాకుండా తన సమస్యలు అన్నీ పవన్ తో చెప్పుకుని వాటి పరిష్కారం తెలుసుకోవాలని అనుకుంటున్నానని చెప్పడమే కాకుండా తాను పవన్ కళ్యాణ్ ను పెళ్ళి చేసుకోవాలని అను కుంటున్నానని ఈమె గత కొద్ది రోజులుగా పవన్ ఇంటి ముందు చేస్తున్న హడావిడి పవన్ సెక్యూరిటీ సిబ్బందికి తలనొప్పిగా మారింది అని టాక్.

దీనితో ఈమె మానసిక పరిస్థితి బాగాలేదు అని గ్రహించిన పవన్ వ్యక్తిగత సిబ్బంది ఆమెను లోకల్ పోలీసు వారికి తెలియ పరిచి ఆమెను పవన్ ఇంటి నుండి వెళ్ళి పోయేలా చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈమె పవన్ ఇంటి ప్రాంగణం నుండి బయటకు రావడానికి పోలీసు వారికి కూడ చుక్కలు చూపెట్టినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఈమె ఎవరూ ? ఎక్కడ నుంచి వచ్చింది అన్న విషయాల పై విచారణ జరుగుతునట్లు తెలుస్తోంది.  సామాన్యంగా టాప్ లెవల్ సెలెబ్రెటీ లకు ఇటువంటి సమస్యలు సర్వ సాధారణమే అయినా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ఈ సంఘటన జరిగింది కాబట్టి ఈ సంఘటన మీడియాకు అభిమానులకు షాకింగ్ న్యూస్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: