అఖిల్ తన తొలి సినిమా ఘోర పరాజయం తరువాత చాల రోజులు నైరాశ్యం లోకి వెళ్లిపోయి చిట్టచివరికి తన మూడ్ ను సెట్ చేసుకుని అనేకమంది దర్శకులను మార్చిన తరువాత తన రెండవ సినిమాకు దర్శకుడు విక్రమ్ కుమార్ ను దర్శకుడుగా ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ విషయాన్ని అధికారికంగా కూడ ప్రకటించారు.

అయితే అఖిల్ స్పీడ్ కు ఇప్పుడు విక్రమ్ కుమార్ బ్రేక్స్ వేస్తున్నట్లు టాక్.  ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను విక్రమ్ కుమార్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు పెట్టలేదు అన్న వార్తలు వస్తున్నాయి.  విక్రమ్ కుమార్ కు ఈమధ్యనే పెళ్ళి అయిన నేపధ్యంలో ఆ వ్యవహారాలలో బిజీగా ఉన్న విక్రమ్ అక్కినేని కాంపౌండ్ ఒకే చెప్పిన అఖిల్ రెండవ సినిమా కథకు ఇంకా పూర్తి స్వరూపం కూడ తయారు చేయలేదు అన్న వార్తలు వస్తున్నాయి.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభం జనవరి నెలాఖరుకు మొదలై వచ్చే సంవత్సరం దసరాకు విడుదల అయ్యే విధంగా విక్రమ్ చాల తాపీగా ఈ మూవీ ప్రాజక్ట్ వ్యవహారాలను నడిపిస్తున్నట్లు టాక్. వచ్చే సంవత్సరం దసరా అంటే అప్పటికి అఖిల్ తన మొదటి సినిమాను విడుదల చేసి రెండు సంవత్సరాల వ్యవధి పూర్తి అవుతుంది

రెండు సంవత్సరాల లాంగ్ గ్యాప్ తరువాత అఖి తన రెండవ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినప్పుడు తన మొదటి సినిమా ఘోర పరాజయాన్ని జనం మర్చిపోతారు అనే ఆలోచన ఉన్నా ఇంత లాంగ్ టైమ్ గ్యాప్ వల్ల ఇప్పటికే తగ్గి పోయిన తన ఇమేజ్ మరింత తగ్గి పోయే ప్రమాదం ఉందా ? ఆలోచనల మధ్య అఖిల్ తల పట్టుకుంటున్నట్లు టాక్.  

అయితే విక్రమ్ కుమార్ సిన్మాలను చాల నెమ్మదిగా తీస్తాడు అన్న పేరు ఉండటమే కాకుండా తన సినిమాల సబ్జెక్ట్స్ అన్నీ డిఫరెంట్ గా ఉండే నేపధ్యంలో అఖిల్ కోరుకునే బ్లాక్ బస్టర్ హిట్ విక్రమ్ కుమార్ కు ఇచ్చే శక్తి ఉందా అన్న చర్చలు అప్పుడే ఫిలింనగర్ లో మొదలైపోయాయి.  ఇప్పటికే ఒక ప్రయోగంతో చేయి కాల్చుకున్న అఖిల్ ప్రయోగాలు చేసే విక్రమ్ కుమార్ దగ్గర  ఎంత వరకు నిలబదగాలుగుతాడు అన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

అయితే రాజకీయాలలో సినిమాలలో ఒక సంవత్సర కాలం అంటే చాల ఎక్కువ టైమ్ కాబట్టి 2017 లో వచ్చే దసరా లోపు ఎన్నో మార్పులు చేర్పులు టాలీవుడ్ నెంబర్ పొజిషన్ లో వచ్చే నేపధ్యంలో మరో సంవత్సరం గ్యాప్ తన కెరియర్ కు ఎంత వరకు శ్రేయస్కరం అన్న ఆలోచనలలో అఖిల్ ప్రస్తుతం తెగ మధన పడిపోతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: