తెలుగు ఇండస్ట్రీలో పునాధిరాళ్లు చిత్రంతో తన ప్రస్థానం మొదలు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి అంచెలంచెలుగా పైకి వచ్చారు. ఎలాంటి సినీ బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిరంజీవి ఎన్నో ముళ్లబాటను ఎత్తు పల్లాలను దాటుకుంటూ ఇప్పుడు ఆయన వారసులకు పూల బాట వేశారు. ఈ మాటలు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూనే ఉంటారు. దశాబ్ధాలుగా తెలుగు సినీ సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన రారాజు మెగాస్టార్ చిరంజీవి.  
Image result for chiru 150 movie stills
ఇక హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే శంకర్ దాదా జిందాబాద్ చిత్రం తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. సొంతగా ఓ ప్రజారాజ్యం పార్టీ స్థాపించి అచిరకాలంలోనే దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇక పది సంవత్సరాల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించ బోతున్నారు. అయితే ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజీషన్లోనే ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఆ మద్య చిరంజీవి కి సంబంధించిన ఓ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ అన్నయ్య సినిమా విడుదల అయిన తర్వాత టాలీవుడ్ నెంబర్ వన్ గా అన్నయ్య పేరు మారుమోగుతుంది.
Image result for chiru 150 movie stills
ఏ స్టార్ అయినా సరే మెగాస్టార్ తర్వాతే అంటూ ఎంతో ఎమోషన్ కి గురయ్యారు.   దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ తన 150వ సినిమాకు చిరంజీవి మేకప్ వేసుకోబోతున్నాడు అని తెలిసిన మరుక్షణం నుంచీ అందరి అనుమానాలు కూడా ఒక్కటే. చిరంజీవి మళ్ళీ ఆ స్థాయిలో డ్యాన్స్ చేయగలడా? ఆ రేంజ్ పిజిక్ మళ్ళీ వస్తుందా? గ్రామర్ విషయం ఏంటి? ఇవీ ఆ సందేహాలు. వీటిని సమాధానం ఇస్తూ ఆ మద్య బ్రూస్ లీ చిత్రంలో చిరంజీవి ఇంట్రడక్షన్ చూస్తుంటే నిజంగా రాంచరణ్ కూడా ఆశ్చర్యానికి గురైనంత పని అయ్యింది. చిరంజీవి స్టామినా ఇంకా అలాగే ఉండటం మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాం తీసుకు వచ్చింది.  
Image result for megastar family heroes
చిరంజీవి ఫైట్స్, స్టైల్, హార్స్ రైడింగ్ చూస్తుంటే నిజంగా పది సంవత్సరాల క్రితం ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. అంతే కాదు ఆ మద్య మా టీవి వారు నిర్వహించిన చిరు గ్రాండ్ ఎంట్రీలో సాయిధరమ్ తేజ్, సునీల్,శ్రీకాంత్, నవదీప్ లాంటి హీరోలతో చిరంజీవి వేసిన స్టెప్పులకు అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. ఇలా చిరంజీవి తనలో స్టామినా ఏమాత్రం కోల్పోకుండా మంచి ఉత్సాహంతో ఇప్పుడు వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెం.150’ చిత్రంలో నటిస్తున్నారు.
Image result for megastar family heroes
ఈ చిత్రం షూటింగ్ ఏమాత్రం గ్యాప్ లేకుండా సాగుతుంది. ఇందులో ఓ మాస్ మసాలా సాంగ్, ఫైట్స్, కామెడీ  ఇలా అన్ని ఎలిమెంట్స్ తో సినిమా ఉండబోతుందని దర్శకులు అంటున్నారు. చిరంజీవి డ్యాన్స్ కనుక ఠాగూర్ సినిమా రేంజ్‌లో ఉంటే మాత్రం ట్రేడ్ ఎనలిస్టులు అందరూ కూడా ఈ సినిమా క్రియేట్ చేయబోయే రికార్డ్స్ కౌంట్ చేయడానికి  రెడీగా ఉన్నట్టే లెక్క. 

Image result for megastar 150 movie stills


మరింత సమాచారం తెలుసుకోండి: