అక్కినేని వారి కుటుంబ కోడలుగా ఇంకా పూర్తిగా మారకుండానే సమంత పేరు నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో మారిపోయింది అంటూ సెటైర్లు పడుతున్నాయి.  దీని వెనుక ఒక కారణం ఉంది.  టాలీవుడ్ సినిమా రంగంలో టాప్ సెలెబ్రెటీల పిల్లలను బాబు అంటూ గౌరవంగా పిలుస్తారు.

ఇదే కల్చర్ తో నాగార్జునను అన్నపూర్ణ స్టూడియోస్ లో చినబాబు అంటూ అభిమానంగా పిలుస్తారు. గతంలో నాగార్జున ‘చినబాబు’ టైటిల్ తో ఒక సినిమా కూడ చేసాడు.  ఇప్పుడు ఈ బాబుల కల్చర్ తగ్గిపోయి వారి పేర్ల ముందు ట్యాగ్ ల కల్చర్ బాగా పెరిగి పోయింది. 

అయితే  సమంత తిరిగి పాత కల్చర్ లోకి వెళ్ళి పోతోందా అని అనిపిస్తోంది అంటూ ఆమె పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  దీనికి కారణం చైతన్యతో సమంత పెళ్ళి దాదాపు ఖాయం అయిపోయిన నేపధ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో పని చేసేవారు వారి మాటల మధ్య ఎప్పుడు సమంత ప్రస్తావన వచ్చినా సమంతను చిన్న మేడమ్ అని గౌరవంగా పిలవడం అప్పుడే మొదలు పెట్టేసారని టాక్.  

దీనితో నాగచైతన్యను పెళ్ళి చేసుకున్న తరువాత సినిమాలకు ఇంచుమించు దూరం అయ్యే సమంత అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక వింగ్ సమంత హ్యాండిల్ చేసినా ఆశ్చర్యం లేదు అంటూ మరి కొందరు జోక్ చేస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య ఎప్పుడూ లేని విధంగా హైపర్ యాక్టివ్ గా మారిపోయి వరసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్న నేపధ్యం చూస్తూ ఉంటే సమంత ప్రభావమా అంటూ మరికొందరు జోక్స్ చేస్తున్నారు.

ఈ వార్తలు ఇలా ఉండగా నాగచైతన్య రానున్న రోజులలో సినిమా నిర్మాణంలో కూడ బాగా యాక్టివ్ అవ్వాలని ఇప్పటికే నిశ్చయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమంతకు కూడ సినిమా నిర్మాణం పై మంచి అభిరుచి ఉన్న నేపధ్యంలో వీరిద్దరి జంట రాబోయే కాలంలో టాలీవుడ్ లో చాల హడావిడి చేసే అవకాశం ఉంది అని అంటున్నారు.   

ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ సమంత అతి సామాన్య కుటుంబంలో పుట్టిన తాను ఒక టాప్ హీరోయిన్ గా ఎదిగి పోయి ఇంత పేరులోకి రావడం తనకే ఆశ్చర్యం అని పించి ఇది నిజమేనా అని అనుకుంటూ తనను తాను గిల్లుకుంటానని జోక్ చేసింది.  అదేవిధంగా హీరోయిన్ గా అన్నపూర్ణ స్టూడియోస్ కు షూటింగ్ లకు వచ్చిన సమంత అక్కడి స్టాఫ్ చేత చిన్న మేడమ్ అని పిలిపించుకుంటానని నిజంగా కలలో కూడ ఊహించుకుని ఉండదు..


మరింత సమాచారం తెలుసుకోండి: