సినిమా ఇండస్ట్రీలో ఈ మద్య మల్టీస్టారర్ చిత్రాలు బాగా వస్తున్నాయి. ఇక టాప్ హీరో సినిమాలో మరో టాప్ హీరో గెస్ట్ పాత్రలో వస్తే ఆ సినిమాకు ఒక్కసారే హైప్ క్రియేట్ అవుతుంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో గజినీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సూర్య తర్వాత వచ్చిన సింగంగ సీరీస్ తో టాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తమిళంలో సింగం 3 సీక్వెల్ షూటింగ్ జరుతుగుంది.  ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ చక్కర్లు కొడుతుంది. బాహుబలితో   ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడని టాక్ వచ్చింది.  ఇప్పుడు ‘ సింగం 3 ’చిత్రంలో అలాంటి ఆ హీరో వేరే ఏదైనా సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తే ఆ సినిమాకి బోలెడంత హైప్ క్రియేట్ అవుతుంది. 
Image result for surya prabhas
తమిళ స్టార్ హీరో సూర్య గతంలో 'యముడు', 'సింగం' సినిమాలు తీసి హిట్ కొట్టిన ఇప్పుడు సింగం 3 అభిమానుల ముందుకు వస్తున్నాడు.  హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 16న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.సూర్య సరసన అనుష్క, శృతి హాసన్ లు జతకట్టనున్నారు.  ప్రస్తుతం  'సింగం 3' షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని తలకోన అడవుల్లో జరుగుతోంది.
Image result for singam 3 poster
గత సంవత్సరం రిలీజ్ అయిన బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదంచిన ప్రభాస్ తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఇప్పుడు ఈ సినిమాలోయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  అప్పట్లో బాహుబలి చిత్రంలో కూడా సూర్య నటిస్తున్నారని రూమర్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ విషయం పై ప్రభాస్ తో చర్చలు జరుగుతున్నాయని ప్రభాస్ ఓకే చేయడం మాత్రమే మిగిలి ఉంది. మరి ప్రభాస్ ఓకే చెప్తే 'సింగం 3' లో ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: