దర్శక రత్న దాసరి నారాయణరావు ఏ సినిమా ఫంక్షన్ కు వచ్చినా ఎదో ఒక సంచలనం చేస్తూనే ఉంటారు. అందువల్లనే దాసరి ఒక సినిమా ఆడియో ఫంక్షన్ కు వస్తున్నారు అని తెలియగానే దాసరి ఎవర్ని టార్గెట్ చేసాడు అన్న ఆ శక్తి అందరిలోనూ ఉంటుంది.  ప్రస్తుతం సినిమాలు తీయలేక పోతున్న దాసరి ఇలా ఫిలిం ఫంక్షన్స్ లో హడావిడి చేస్తూ మీడియాకు హాట్ టాపిక్ గా కొనసాగుతున్నారు.  

ఈ నేపధ్యంలో దాసరి చాల కాలం తరువాత  ‘మాంజ’ అనే డబ్బింగ్ సినిమా ఆడియో వేడుకకు వచ్చి డబ్బింగ్ సినిమాల పై సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా మధ్యలో పవన్ మహేష్ ల స్టామినా పై సంచలన వ్యాఖ్యలు చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.  తాను డబ్బింగ్ సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్న విషయాన్ని కూడా సవివరంగా వివరిస్తూ తనకు డబ్బింగ్ సినిమాలంటే తనకేమి ద్వేషం లేదని, కానీ డబ్బింగ్ సినిమాల ప్రభావం తెలుగు సినిమా రంగాన్ని బాగా పాడుచేస్తోంది అంటూ తన ఆవేదన వ్యక్త పరిచాడు దాసరి. 

ఇదే సందర్భంలో దాసరి మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ అయిన డబ్బింగ్ సినిమాలు టాప్ హీరోల సినిమాల కలక్షన్స్ కు కూడ చిల్లు పడేలా చేస్తున్నాయి అని అంటూ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోల సినిమాలకు కూడా డబ్బింగ్ హక్కులు కోలీవుడ్ లో  50, 60 లక్షలు దాటలేకపోతుంటే మన తెలుగు నిర్మాతలు  మాత్రం కోట్లు ఖర్చు పెట్టి కోలీవుడ్ సినిమాలను తెలుగులోకి డబ్ చేయడం చూస్తూ ఉంటే తనకు ఆశ్చర్యం కలుగుతోంది అంటూ మరో సంచలన కామెంట్ చేసాడు దాసరి. 

కోలీవుడ్ టాప్ హీరోల సినిమాలను తెలుగులో డబ్ చేయడానికి 20 కోట్ల నుండి 30 కోట్ల వరకు ఖర్చు పెడుతున్న తెలుగు నిర్మాతల పరిస్థితి చూస్తూ ఉంటే తనకు ఆవేశంతో పాటు జాలీ  కూడ కలుగుతోంది అంటూ సెటైర్ వేసాడు దాసరి.   చిన్న సినిమాల స్థానాన్ని డబ్బింగ్ సినిమాలు ఆక్రమించుకుని, చిన్న సినిమాలకు స్క్రీన్లు లేకుండా చేస్తున్నాయని, ఇందు కోసమే తానూ డబ్బింగ్ సినిమాల వైపు చూడడం లేదని అంతేకాదు తాను డబ్బింగ్ సినిమాల  ప్రమోషన్స్ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని అంటూ అసలు విషయాన్ని బయట పెట్టాడు దాసరి. 

అయితే తాను ‘మాంజ’ సినిమా  ఆడియో ఫంక్షన్ కు రావడానికి ఒక కారణం ఉందని తానూ ఈ సినిమాను చూశానని నిజంగా ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది అని కామెంట్స్ చేసాడు దాసరి. ఇదే సందర్భంలో మాట్లాడుతూ దాసరి మన టాప్ హీరోలైన మహేష్, పవన్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ తదితరులకు కోలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న క్రేజ్ తో సంబంధం లేకుండా కోలీవుడ్ లో ఊరు పేరు లేని హీరోల సినిమాలను కూడా తెలుగు నిర్మాతలు నెత్తిన పెట్టుకోవడం దౌర్భాగ్యం అంటూ చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరిచింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: