గత కొంత కాలంగా మీడియాకు చాల దూరంగా ఉన్న రాజమౌళి నిన్న సాయంత్రం మీడియా ముందుకు వచ్చి ‘బాహుబలి 2’ సంబంధించిన అనేక విషయాలను షేర్ చేసుకోవడమే కాకుండా మరో సస్పెన్స్ కు తెర తీసాడు రాజమౌళి.  అక్టోబర్ 5న ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందించబోతున్నామని చెపుతూ అయితే అది ప్రభాస్ పెళ్ళి న్యూస్ కాని మరో విషయం విషయం కాని కాదు అంటూ అది ఎవ్వరూ ఊహించలేని సస్పెన్స్ అని మరో ట్విస్ట్ ఇచ్చాడు రాజమౌళి.  

అంతేకాదు అక్టోబర్ నెలంతా ‘బాహుబలి 2’ నెలగా మారబోతోంది అని అంటూ అక్టోబర్ 22న ‘బాహుబలి 2’ ఫస్ట్ లుక్ అదేవిధంగా  ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 23న ‘బాహుబలి 2’ మేకింగ్ వీడియో విడుదల చేయబోతున్నట్లు ప్రభాస్ అభిమానులకు జోష్ ను ఇచ్చే వార్తలను లీక్ చేసాడు జక్కన్న. ‘బాహుబలి 2’ సంబంధించి రెండు పాటలు, కొన్ని యాక్షన్ స్వీకెన్స్ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉందని అంటూ ‘బాహుబలి’ కామిక్ బుక్స్  కూడా విడుదల చేయబోతున్నా విషయాన్ని బయట పెట్టాడు రాజమౌళి.  

అక్టోబర్ 1న అమెజాన్ ప్రయిమ్ లో ‘బాహుబలి’ ఏనిమేటెడ్ బుక్స్ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ విడుదలవుతాయని చెపుతూ ‘బాహుబలి’ ఒక బ్రాండ్ లా తాను ఉన్నా లేకపోయినా కొనసాగుతూనే ఉంటుందని అంటూ తాను ఖచ్చితంగా ‘బాహుబలి 3’ తీయబోతున్నాను  అన్న విషయాన్ని కూడ లీక్ చేసాడు రాజమౌళి.  వచ్చే ఏడాది ఏప్రియల్ 28న   ‘బాహుబలి 2’  ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న విషయాన్ని అధికారికంగా రాజమౌళి మరొకసారి ప్రకటించడంతో ఈ సినిమాకు దాదాపు 6 నెలలు ముందుగానే రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్ ను మొదలు పెట్టాడు అనుకోవాలి.

 అయితే ప్రభాస్ అభిమానులు అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్ మాత్రం జనవరి 2017లోనే వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో ప్రభాస్ అభిమానులకు అప్పటి దాక ఎదురు చూపులే మిగిలాయి అనుకోవాలి.  ఇకపోతే అక్టోబర్ నెలంతా బాహుబలి అభిమానులకు పండగనే అనుకోవాలి. ఈరోజు ఈసినిమా యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ తో ప్రారంభం అవుతున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఈనెల అంతా కొనసాగుతూనే ఉండటంతో ఈ నెల ప్రభాస్ అభిమానులకు దసరా దీపావళి లను మించిన పండుగలా మారబోతోంది.  

ఇదే సందర్భంలో రాజమౌళి బాహుబలి వర్చ్యువల్ రియాల్టీ ఎక్స్ పీరియన్స్ సంబంధించిన విషయాలను కూడ షేర్ చేయడంతో రాజమౌళి ‘బాహుబలి’ ని ఒక సినిమాగా కాకుండా ఒక భారీ బ్రాండ్ గా మార్చబోతున్న సంకేతాలు ఇవ్వడంతో రాజమౌళి చాల భారీ మార్కెట్ స్కెచ్ లను వేసినట్లే కనిపిస్తోంది.  

నిన్న ప్రెస్ మీట్ లో రాజమౌళి ఆవిష్కరించిన ‘బాహుబలి 2’ పోస్టర్ లో దేవసేనగా నటిస్తున్న అనుష్కకు ప్రాధాన్యత ఇస్తూ ఒక భారీ పోస్టర్ రిలీజ్ చేయడం బట్టి ‘బాహుబలి 2’ లో అనుష్క దేవసేన పాత్ర చాల కీలకం అనే సంకేతాలను ఇస్తున్నాడు రాజమౌళి..


మరింత సమాచారం తెలుసుకోండి: