నిన్న జరిగిన ‘బాహుబలి 2’ ప్రెస్ మీట్ లో రాజమౌళి తన సినిమా విశేషాలను వివరిస్తూ ‘బాహుబలి 2’ విడుదల అయిన తరువాత కలెక్ట్ చేయబోయే కలక్షన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి.  ఈ సమావేశానికి వచ్చిన మీడియా వర్గాలు రాజమౌళిని కార్నర్ చేస్తూ ‘బాహుబలి’ బిగినింగ్ 600 కోట్లకు పైగా కలక్షన్స్ వసూలు చేసింది కాబట్టి ‘బాహుబలి 2’ పై మీ అంచనాలు ఏమిటి అం ప్రశ్నించినప్పుడు రాజమౌళి చాల వ్యూహాత్మకంగా స్పందించాడు.

తాను ‘బాహుబలి 2’ విషయంలో కలెక్షన్స్ పార్ట్ 1కు వచ్చిన కలక్షన్స్ కన్నా 30  శాతం అధికంగా వస్తాయని భావిస్తున్నాను అని ఓపెన్ గా చెప్పడంతో ‘బాహుబలి 2’ 800 వందల కోట్ల కలక్షన్స్ వసూలు చేసే సినిమాగా మారబోతోంది అంటూ బయ్యర్లకు వ్యూహాత్మక సంకేతాలు ఇచ్చాడు.  ఈ కామెంట్స్ రాజమౌళి నోటివెంట రావడంతో ‘బాహుబలి 2’ డిస్ట్రిబ్యూషన్ రెట్లు రెట్టింపు కాబోతున్నాయి అన్న సంకేతాలు బయ్యర్లకు రాజమౌళి ఈ ప్రెస్ మీట్ ద్వారా పంపినట్లు అయిందని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే రాజమౌళి ‘బాహుబలి 2’  బాలీవుడ్ మాత్రం టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలవాలని ఆశిస్తున్నాను అని అనడమే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మొదటి 10 సినిమాల్లో ఒకటిగా ‘బాహుబలి 2’ ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పడంతో  ఈ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రేట్స్ అన్ని భాషలలోను పెరగబోతున్నాయి అన్న స్పష్టమైన సంకేతాలు రాజమౌళి ఇచ్చినట్లు అయింది. 

ఒకవైపు ‘బాహుబలి’ ఒక సినిమాలా కాకుండా ఒక మహా వృక్షంలా మారి ఒక బ్రాండ్ ఇమేజ్ వైపు పరుగులు తీస్తోంది అని రాజమౌళి చెప్పడం బట్టి జక్కన్న ఈ సినిమా కోసం గత 4 సంవత్సరాలుగా పడుతున్న కష్టానికి తన జీవితాంతం ‘బాహుబలి’ ఫలితాలు అనుభవించాలి అన్న రాజమౌళి మెగా స్కెచ్ అతడు మాట్లాడిన ప్రతి మాటలోనూ చాల స్పష్టంగా కనిపించింది.  రాజమౌళి మాటలు బట్టి చూస్తూ ఉంటే ఒక హాలీవుడ్ సీరీస్ లా ‘బాహుబలి’ హంగామా మరో పది సంవత్సరాలు కొనసాగినా ఆశ్చర్యం లేదు అనిపిస్తోంది. 

ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి అంచనాలు బయటకు వచ్చేసాయి కాబట్టి ఇక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వివిధ ప్రాంతాలకు చెందిన బయ్యర్లు ఎంత వరకు రాజమౌళి అంచనాలకు అంగీకరిస్తారో చూడాలి.  ఏమైనా నిన్న జరిగిన మీడియా సమావేశాన్ని రాజమౌళి చాల వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నాడు అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: