తెలుగు ఇండస్ట్రీలో ‘ఝుమ్మందినాధం’ చిత్రంతో హాట్ హాట్ గా దర్శనమిచ్చిన తాప్సీ తర్వాత వచ్చిన సినిమాల్లో పెద్దగా సక్సెస్ సాధించలేక పోయింది. కాకపోతే ఈ అమ్మడు నటించిన సినిమాలపై ఎలాంటి టాక్ వచ్చినా తాప్సీ తన గ్లామర్ తో బాగా ఆకట్టుకునేది. ఒకదశలో సైడ్ హీరోయిన్ గా కూడా వచ్చిన తాప్సీ ఆ మద్య గోపీ చంద్ తో తీసిన ‘సాహసం’ చిత్రం కాస్త మంచి పేరు తెచ్చింది. గత సంవత్సరం లారెస్స్ సరసన వచ్చిన కాంచన 2 తెలుగులో గంగ చిత్రం మంచి విజయం సాధించింది. అయినా కూడా తాప్సికి మాత్రం పెద్ద చాన్సులు ఏమీ రాలేదు.  
Image result for taapsee pannu hot pics
ఈ బాలీవుడ్ భామ తెలుగులో ఇంట్రడక్షన్ ఇచ్చినా పెద్దగా సక్సెస్ కాలేకపోవడం తెలుగు ఇండస్ట్రీపై అసహనం పెంచుకుంది. దీంతో బాలీవుడ్ పయనం అయ్యింది..అదృష్టం కొద్ది అమితాబ్ తో నటించిన ‘పింక్’ చిత్రం అక్కడ అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రంలో నటించిన తాప్సీ  విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. దీంతో ఈ అమ్మడికి ఒక్కసారే బాలీవుడ్ పై అమితమైన ప్రేమ కలిగిందో ఏమో కానీ తనను పరిచయం చేసిన తెలుగు ఇండస్ట్రీపై దుమ్మెత్తి పోసింది.
Image result for taapsee pannu hot pics
టాలీవుడ్ లో హీరోయిన్ లకు అంతగా ప్రాధాన్యం లేదని కేవలం హీరోలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని , అలాగే హీరోయిన్ లకు ఇవ్వాల్సిన సొమ్ము సమయానికి ఇవ్వరని నాకు సమయానికి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన సందర్బాలు చాలా ఉన్నాయని ఆరోపించింది.  గతంలో ఇదే మాట హాట్ బ్యూటీ రాధికా ఆప్టే కూడా ఆరోపించింది. తెలుగు ఇండస్ట్రీలో కేవలం హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని హీరోయిన్లను కేవలం గ్లామర్ గా చూడటం రెండు మూడు పాటల వరకే ప్రాధాన్య ఇస్తారని ఆరోపించి సంచలనం రేపింది. తాజాగా తాప్సీ కూడా రాధికా ఆప్టే బాటే పట్టింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: