భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ నటులను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా, మరో సంచలన ప్రకటన చేసింది. పాకిస్థానీ నటులు ఇక్కడ కనపడితే దాడులు చేస్తామని ఎంఎన్ఎస్ హెచ్చరించింది. ఈ మేరకు ఎంఎన్ఎస్ కీలక నేత అమేయ్ ఖోపర్ మాట్లాడుతూ, పాకిస్తానీ నటులతో తీస్తున్న సినిమా నిర్మాణాలను అడ్డుకుంటామని అన్నారు.


Image result for salman khan navanirmana sena

పాకిస్థాన్ సినీ నటులకు మద్దతుగా నిలిచిన బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకునేలకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు మీడియాతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) నేత అమేయ్ ఖోపర్ మాట్లాడుతూ, చాలా మంది సమర్థిస్తున్నట్లు పాకిస్థానీ నటుల్లో ఒక్కరు కూడా వర్క్ పర్మిట్లు తీసుకోలేదన్నారు. టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారని ఆయన చెప్పారు. ఇలా నటించడం చట్టవ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.


Image result for salman khan navanirmana sena

ఇకపై ఇలా జరగకుండా చూసేందుకు దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ఇప్పటికిప్పుడు పాకిస్థానీ నటులు కనిపిస్తే దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. సల్మాన్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన‌ శివసేన నాయకురాలు మనీషా కాయండే.. ఆయ‌న‌కు ఈ విషయంలో పాఠం నేర్పించాలని వ్యాఖ్యానించారు. ఆ దేశ‌ నటులంటే సల్మాన్‌కు అంత ప్రేమ ఉంటే ఆయనే పాక్‌ను వెళ్లిపోవాలని ఆమె అన్నారు. 


Image result for salman khan navanirmana sena
స‌ల్మాన్ వ్యాఖ్య‌ల‌పై ఎంఎన్ఎస్ నేత‌ అమే ఖోప్కర్ స్పందిస్తూ.. ఇండియాలో ఉంటున్న‌ పాకిస్థానీ నటులు వర్క్ పర్మిట్లు తీసుకోకుండానే ఇక్క‌డ‌కు వ‌స్తున్నార‌ని అన్నారు. టూరిస్ట్ వీసాపై వారు భార‌త్‌కు వ‌స్తున్నార‌ని అన్నారు.ఇది చట్టవ్యతిరేకమే అని ఆయన సల్మాన్‌కు స‌మాధాన‌మిచ్చారు. ఈ అంశాన్ని తాము స‌ర్కారు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్ర‌స్తుతం మాత్రం పాకిస్థానీ నటులు కనిపిస్తే దాడులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. అంతేగాక‌, ఆ దేశ న‌టీన‌టులు ప‌నిచేస్తోన్న బాలీవుడ్‌ సినిమాల నిర్మాణాలను అడ్డుకుంటామ‌ని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: