లాస్ట్ ఇయర్ శ్రీమంతుడు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాడని తెలియక బాహుబలి రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశాడు రాజమౌళి.. అయితే బాహుబలి ది బిగినింగ్ కోసం మహేష్ కాస్త వెనక్కి తగ్గక తప్పలేదు. ఇక ఆ సీన్ మళ్లీ రిపీట్ అవుద్ది అనుకున్నాడో ఏమో జక్కన్న అందుకే బాహుబలి కన్ క్లూజన్ రిలీజ్ డేట్ ను ముందే ఎనౌన్స్ చేశాడు. మొన్నటిదాకా ఏప్రిల్ 28 అని టాక్ ఉన్నా అఫిషియల్ గా ఎనౌన్స్ చేసింది మాత్రం నిన్న జరిగిన ప్రెస్ మీట్లోనే.


ఈ కారణాలన్ని చూస్తే మహేష్ తో మళ్లోసారి క్లాష్ ఏర్పడకుండా చూడాలనే ఉద్దేశంతోనే రాజమౌళి ఈ ప్రెస్ మీట్ ప్లాన్ వేశాడట. సడెన్ గా బాహుబలి-2 ప్రెస్ మీట్ అంటే సినిమాకు సంబందించిన ఏ విషయాన్ని ఎనౌన్స్ చేస్తాడా అని ఫ్యాన్స్ అందరు ఈగర్ గా ఎదురుచూస్తే ఎప్పటిలానే ప్రమోషన్స్ యాస్పెక్ట్స్ తో పాటుగా రిలీజ్ డేట్ కూడా అధికారికంగా చెప్పేశాడు రాజమౌళి.


ఇక ఓ పక్క మహేష్ మురుగదాస్ తో చేస్తున్న సినిమా కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. శ్రీమంతుడు బాహుబలి మొదటి పార్ట్ విషయంలో ఇలాంటి కన్ ఫ్యూజన్ తోనే రిలీజ్ చేయడం జరిగింది మరి ఈసారి అలా జరుగకుండా రెండు సినిమా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. చెన్నైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మహేష్ మూవీ ఈసారి కూడా సమ్మర్ టార్గెట్ తో రిలీజ్ అవుతుంది.


బ్రహ్మోత్సవం ఫ్లాప్ తర్వాత మహేష్ చేస్తున్న సినిమా కాబట్టి ఆ సినిమాపై ఏ కోణంలో అభిమానులను నిరాశ పరచకుండా హిట్ టార్గెట్ ప్లాన్ చేస్తున్నాడు మహేష్. ఇక మురుగదాస్ కూడా అకిరా ఫ్లాప్ తో తనను తాను ప్రూవ్ చేసుకునే సందర్భంలో మహేష్ తో మూవీని ఎలాగైనా బ్లాక్ బస్టర్ చేసేలా తెరకెక్కిస్తున్నాడట. లాస్ట్ ఇయర్ బాహుబలి క్రియేట్ చేసిన రికార్డులను తప్పించి మిగతా వన్ని శ్రీమంతుడు ఓవర్ టేక్ చేయగా ఈసారి మళ్లీ పార్ట్-2 చేయగా మిగిలిన రికార్డులన్ని మహేష్ మరోసారి తన సినిమాతో బీట్ చేసేస్తాడంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: