నైజాంలో బడా డిస్ట్రిబ్యూటర్ అంటే ఎంతమంది ఉన్నా ఓ దశాబ్ధ కాలంగా దిల్ రాజు పేరే బాగా వినిపించేది.. సినిమాల సెలక్షన్ విషయంలో కూడా దిల్ రాజు సూపర్ గా ఆలోచిస్తాడు. అయితే ప్రస్తుతం నిర్మాతల మధ్య దర్శకుల మధ్యే పోటీ ఏర్పడుతుంటే ఇక పంపిణీదారుల మధ్య పోటీ ఉండదా చెప్పండి. రీసెంట్ గా వచ్చిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పటికే దిల్ రాజు సగం పని ఖాళీ అయ్యేలా చేశాడు.


పెద్ద పెద్ద సినిమాలన్నిటిని అభిషేక్ పిక్చర్స్ కైవసం చేసుకుని దిల్ రాజు మీద పగ సాధించడం మొదలు పెట్టింది. ఇక ఇదే తరుణంలో హీరో నితిన్ కూడా దిల్ రాజు పాలిట శత్రువుగా మారాడు. తండ్రి సుధాకర్ రెడ్డి స్వతహాగా పంపిణీదారుడు కావడంతో ఈసారి తండ్రి భాధ్యతలన్ని తన మీద వేసుకుంటున్న నితిన్ తన గ్లోబల్ మీడియా ద్వారా సొంతంగా క్రేజీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే ఆలోచనలో ఉన్నాడు.


ఇక ఈ క్రమంలోనే భారీ అంచనాలతో వస్తున్న బాలయ్య వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి నైజాం రైట్స్ నితిన్ దక్కించుకున్నాడు. దిల్ రాజు మీద పోటీగా వచ్చి ఈ రైట్స్ దక్కించుకోవడం చూస్తుంటే రాను రాను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్ల రచ్చ మాములుగా ఉండవనిపిస్తుంది. సాధారణంగా నైజాంలో కరెక్ట్ సినిమా పడితే అన్ని ఏరియాలు కలిపి వసూళు చేసినంత ఈ ఒక్క ఏరియా కలెక్ట్ చేస్తుంది.


కాబట్టి దిల్ రాజుకి అందరు ఎదురు నిలుస్తున్నారు. క్రిష్ డైరక్షన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ సినిమా దిల్ రాజు ఎలా వదిలాడో కాని నితిన్ మాత్రం పట్టుబట్టి మరి సినిమా చేజిక్కించుకున్నాడు. సో మరి భారీ ఎమౌంట్ తో శాతకర్ణి సినిమాను సొంతం చేసుకున్న నితిన్ ఫలితం ఎలా అందుకుంటాడో చూడాలి. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా కచ్చితంగా ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది అని మాత్రం చెప్పగలం.  


మరింత సమాచారం తెలుసుకోండి: