ప్రకాష్ రాజ్.. ఓ విలక్షణ నటుడు. ఓ విలన్ గా, కమేడియన్ గా, ఓ తండ్రిగా, ఓ భర్తగా, ఓ హీరోగా (ఇప్పుడు కాదులేండి అప్పట్లో) ఎన్నో పాత్రల్లో మెరిపించాడు. ప్రేక్షకుల మనన్నలు పొందాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ రంగంలో తనకంటు ప్రత్యేక గుర్తింపు పొందాడు. తనకు మరెవరు సాటి రారని నిరూపించుకున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమలో అయితే పదేళ్ల క్రితం ప్రకాష్ రాజ్ లేని సినిమా లేదంటే.. నమ్మశక్యం కాదు. అంతటి పాపులారిటీ సంపాదించిన ప్రకాష్ రాజ్ ప్రస్తుతం అడుకుంటున్నాడు. అంత బతుకు బతికి.. ఇంటెనకాల చచ్చినట్లుగా...